Pawan Kalyan: జగన్ రెడ్డి వల్ల నాకు ఎన్ని కోట్లు లాసో తెలుసా? ఆ లాస్ నేనే భరించా?
ABN , First Publish Date - 2023-06-21T21:19:10+05:30 IST
ఏపీ సీఎం జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గించడం, థియేటర్ల వద్ద ప్రభుత్వ అధికారులతో పహారా చేయించడం వంటి పనులను జగన్ రెడ్డి చేయించినట్లుగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి చేయించిన ఈ పనులతో నిర్మాతలకు రూ. 30 కోట్లు లాస్ వచ్చిందని, ఆ లాస్‌ని తనే భరించానని వెల్లడించారు.
ఏపీ సీఎం జగన్ రెడ్డి (AP CM Jagan Reddy), ఆయన ప్రభుత్వంపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గించడం, థియేటర్ల వద్ద ప్రభుత్వ అధికారులతో పహారా చేయించడం వంటి పనులను జగన్ రెడ్డి చేయించినట్లుగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఇలాంటి పనుల వల్ల.. తన సినిమాలు హిట్టయినా కూడా.. ఏపీలో నిర్మాతలకి రూ. 30 కోట్లు నష్టం వచ్చిందని.. ఆ నష్టాన్ని కూడా తనే భరించానని జనసేనాని తన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రస్తుతం పవర్ స్టార్ (Power Star)గా, జనసేనాని (Janasenani)గా.. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రెండు పడవల ప్రయాణం చేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే.. మరోవైపు వారాహి యాత్రతో ప్రజలకు చేరువవుతున్నారు. సినిమాల పరంగా ‘బ్రో’ (Bro) మూవీ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh) చిత్రాల షూటింగ్స్‌ని కూడా మూవ్ చేస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్ర షూటింగ్‌లో కూడా త్వరలోనే ఆయన పాల్గొననున్నారు. ఇవి కాకుండా ఇంకో రెండు మూడు సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా కూడా ఇటీవల వార్తలు వచ్చాయి.
రాజకీయాల పరంగా.. ప్రస్తుతం ఆయన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్ర (#VarahiYatra)ను నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఆయా నియోజక వర్గాలలో ఉన్న అధికార పార్టీ నాయకులపై, వారు చేసిన అవినీతిపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తుతున్నారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తన సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా.. నిర్మాతలకు భారీగా నష్టం వచ్చిందని తెలియజేశారు. ‘‘నా సినిమాలు ‘వకీల్ సాబ్’ (Vakeel Saab), ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) విడుదలైనప్పుడు ఏపీలో టికెట్ రేట్లు కావాలనే భారీగా తగ్గించారు. టికెట్ రేట్ కేవలం రూ. 10 అంటే.. పెట్టుబడి ఎప్పటికి తిరిగొస్తుంది?. ఆ రెండు సినిమాలూ హిట్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వరకు నిర్మాతలకు రూ. 30 కోట్ల నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని నేనే భరించాను’’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Varun Sandesh: సినిమా షూటింగ్‌లో హీరో వరుణ్ సందేశ్‌కు గాయాలు
**************************************
*Regina: ‘రెజీనా’ కోసం ఈ హీరోయిన్ చేసిన సాహసం ఏంటో తెలుసా?
**************************************
*Natti Kumar: పవన్‌పై ముద్రగడ, ద్వారంపూడి చేసిన విమర్శలపై నట్టికుమార్ ఫైర్
**************************************
*Adipurush: డైరెక్టర్‌దే కాదు.. 50 శాతం ప్రభాస్ తప్పు కూడా ఉంది.. నటి సంచలన వ్యాఖ్యలు
**************************************
*Tiku Weds Sheru: 49 ఏళ్ల హీరో, 21 హీరోయిన్‌ల మధ్య కిస్సింగ్ సీన్.. రచ్చ రచ్చ అవుతోంది
**************************************
*Chiranjeevi: పాప పుట్టిన ఘడియలు చాలా మంచివి.. ఆ ప్రభావం కనిపిస్తుంది
**************************************