Kartikeya Gummakonda: అయిదేళ్ల తరువాత సక్సెస్ వచ్చింది, అందుకే మాటలు అటు ఇటు అవుతున్నాయి

ABN , First Publish Date - 2023-08-30T16:54:24+05:30 IST

కార్తికేయ గుమ్మకొండ కి 'ఆర్ఎక్స్ 100' తరువాత హిట్ వచ్చింది ఇప్పుడు గత వారం విడుదలైన 'బెదురులంక 2012' తో. అంటే సుమారు అయిదేళ్ల తరువాత అతనికి ఒక మంచి బ్రేక్ వచ్చింది, అందుకే అతనికి మాటలు తడబడుతున్నాయి

Kartikeya Gummakonda: అయిదేళ్ల తరువాత సక్సెస్ వచ్చింది, అందుకే మాటలు అటు ఇటు అవుతున్నాయి
A still from Bedurulanka 2012

అయిదేళ్ల క్రితం 'ఆర్ఎక్స్ 100' #RX100 అనే సినిమా కార్తీక్ గుమ్మకొండ (KartikGummakonda) కి విజయం ఇచ్చింది. దానికి అజయ్ భూపతి (AjayBhupathi) దర్శకుడు, అతనికి కూడా దర్శకుడిగా అదే సినిమా. ఆ తరువాత కార్తికేయ చాలా సినిమాలు చేసాడు, కానీ విజయం వచ్చినట్టే వచ్చి దూరం అయిపొయింది. గత వారం అతను 'బెదురులంక 2012' #Bedurulanka2012 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్లాక్స్ దర్శకుడు (Clax), ఇది అతనికి మొదటి సినిమా దర్శకుడిగా.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ నాలుగో రోజే వచ్చేసింది, మొదటి రోజు కొంచెం మిక్సిడ్ టాక్ వచ్చినా, రెండో రోజు నుండీ కలెక్షన్స్ బాగా పెరిగాయి. అలాగే కార్తికేయ కి ఈ సినిమా ఒక మంచి బ్రేక్ ఇచ్చింది కూడా. గత అయిదు సంవత్సరాల్లో చాలా సినిమాలు చేసిన వస్తున్నాయి దగ్గరికి, ఎక్కడికో పోతున్నాయి, కానీ ఇప్పుడు మొత్తానికి 'బెదురులంక 2012' #Bedurulanka2012 నేను అనుకున్నది ఇచ్చింది. నేను ఈ సినిమా ముందు నుండీ నమ్మాను, అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా, అందరికీ నమ్మకం అయితే వుంది, ఆలా మేము అనుకున్నట్టుగానే హిట్ అయింది అని చెప్పాడు కార్తీక్.

karthikeya2.jpg

ఒక సంవత్సరంన్నర చేసాము ఈ సినిమాని, హిట్ వచ్చి ఐదేళ్లు అవుతోంది కాబట్టి, నాకు మాటలు అటు ఇటు అవుతున్నాయి, తడబడుతున్నాను అందుకే, అని చెప్పాడు కార్తికేయ, ఈ సినిమా విజయోత్సవాల్లో భాగంగా. ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా సపోర్ట్ చేశారు, అలాగే కథానాయికగా చేసిన నేహా శెట్టి (NehaShetty)పెద్ద నటి అవుతుంది అనటంలో సందేహం లేదు అని చెప్పాడు కార్తికేయ.

ఈ సినిమా ఒక పెద్ద రేంజ్ లోనో, లేదా పెద్దగా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి అనో ముందు అనుకునే విడుదల చేసాము. అయితే విడుదలయిన తరువాత ప్రతి షో కి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులు ఈ సినిమా కలెక్షన్స్ పెంచుకుంటూ వెళ్లారు, ఈరోజు కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, అందరం చాలా సంతోషంగా వున్నాము అని చెప్పాడు కార్తికేయ.

Updated Date - 2023-08-30T16:54:24+05:30 IST