Bhola Shankar: బేస్‌లెస్... సెన్స్‌లెస్... ఎట్టకేలకు స్పందించిన నిర్మాణ సంస్థ!
ABN , First Publish Date - 2023-08-15T10:59:43+05:30 IST
‘భోళా శంకర్’ సినిమా ఫ్లాప్... పారితోషికం విషయంలో చిత్ర నిర్మాతపై చిరంజీవి ఒత్తిడి.. ముక్కు పిండి రెమ్యునరేషన్ వసూలు చేసిన మెగాస్టార్... వడ్డీతో సహా లాక్కుంటాడు బాస్... సినిమా నష్టపోవడంతో అనిల్ సుంకర ఆస్తులు తాకట్టు... పలు ఆస్తుల అమ్మకాలు.. ఇవి ‘భోళాశంకర్’ విడుదలై పరాజయం చవిచూసిన క్షణం నుంచి చిరంజీవిపై వస్తున్న కామెంట్లు.
‘భోళా శంకర్’ సినిమా ఫ్లాప్...
పారితోషికం విషయంలో చిత్ర నిర్మాతపై చిరంజీవి ఒత్తిడి..
ముక్కు పిండి రెమ్యునరేషన్ వసూలు చేసిన మెగాస్టార్...
వడ్డీతో సహా లాక్కుంటాడు బాస్...
సినిమా నష్టపోవడంతో అనిల్ సుంకర ఆస్తులు తాకట్టు... పలు ఆస్తుల అమ్మకాలు..
ఇవి ‘భోళాశంకర్’ విడుదలై పరాజయం చవిచూసిన క్షణం నుంచి చిరంజీవిపై వస్తున్న కామెంట్లు.
ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్లే.. వీటిలో ఉంత నిజం ఉంది అనేది చూడకుండా వైరల్ చేస్తున్నారు పలువురు నెటిజన్లు.
ఇంత పారితోషికం తీసుకున్నాను, ఇంకొంత ఇవ్వాలి అని చిరంజీవిగానీ, ఇంత ఇచ్చానని, కొంత బ్యాలెన్స్ ఉందని, ఇవేం కాదు మొత్తం పారితోషికం ఇచ్చేశానని నిర్మాత గానీ ఎక్కడా చెప్పలేదు. చెప్పాల్సిన అవసరమూ లేదు. ఇన్ని వదంతులు వస్తున్న నేపథ్యంలోనూ ఇరువైపుల ఎవరూ స్పందించలేదు. దాంతో సోషల్ మీడియా, యాంటీ ఫ్యాన్ మరింత రెచ్చిపోవడంతో ఎట్టకేలకు అనిల్ సుంకర నిర్మాణ సంస్థ ఎ.కె ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది. రెమ్యునరేషన్ విషయం చిరంజీవిపై విషం చిమ్ముతున్న వారికి నిర్మాణ సంస్థ ఘాటుగా సమాధానమిచ్చింది. ‘‘సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో నిజంలేదు. అవన్నీ బేస్, సెన్స్ లేని మాటలు. వాటిలో ఒక్కశాతం కూడా నిజం లేదు. దయచేసి ఇలాంటి వార్తలను నమ్మవద్దు. అనవసర చర్చలు చేయవద్దని కోరుతున్నాం’’ అని ట్వీట్ చేశారు. అంతే ‘భోళాశంకర్’ చిత్ర యూనిట్ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు’ తెలిపారు.