AkhilAkkineni: ఏజెంట్ రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాష్ అయింది
ABN , First Publish Date - 2023-04-30T11:30:30+05:30 IST
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన 'ఏజెంట్' సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర క్రాష్ అయింది. కనీసం కరెంట్ ఛార్జీలకు కూడా కొన్ని దగ్గర్ల కలెక్షన్ రాలేదని ట్రేడ్ అనలిస్ట్ అంటున్నారు. అఖిల్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవుతుంది ఈ 'ఏజెంట్'
అఖిల్ అక్కినేని #AkhilAkkineni నటించిన 'ఏజెంట్' #AgentFilm సినిమా మొన్న శుక్రవారం విడుదల అయింది. అఖిల్ కి ఇంకా మంచి రోజులు రానట్టు వున్నాయి, పాపం ఎంత కష్టపడినా కూడా, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది. ఎందుకంటే మొదటి రోజు మొదటి ఆట నుండే ఈ సినిమా బాగోలేదని, సినిమాలో విషయం లేదని టాక్ బయలుదేరింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం #SurenderReddy వహించిన ఈ స్పై థ్రిల్లర్ అసలు ప్రేక్షకుడిని ఏమాత్రం సంతృప్తి పరచలేదు.
ఇందులో మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి (Mammootty) ఒక ప్రధాన పాత్ర పోషించగా, బాలీవుడ్ నటుడు డినో మోరీయా (DinoMorea) కూడా ఇంకో ప్రధాన పాత్ర పోషించాడు. ఇంత స్టార్ కాస్ట్ వున్నా కూడా ఈ సినిమాలో సరిఅయిన కథ లేకపోవటం వలన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. అయితే సినిమాకి వచ్చిన హైప్ వలన మొదటి రోజు ఈ సినిమా సుమారు రూ. 4.9 కోట్లు షేర్ కలెక్టు చేస్తే, రెండో రోజు #AgentCollection ఎంత కలెక్టు చేసిందో తెలుసా.
రెండో రోజు ఒక్క నైజాం ఏరియా కలెక్షన్ అయితే కేవలం రూ.21 లక్షలు మాత్రమే. అంటే ఈ సినిమా ఎంతలా క్రాష్ అయిందో, ఎంత డిజాస్టర్ అయిందో ఊహించుకోవచ్చు. మొత్తం ఆంధ్ర, తెలంగాణ, ఇంకా ఒథెర్ ఏరియాస్ కలిపి చూస్తే కోటి రూపాయల వరకు ఉండొచ్చు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. అంటే ఈ సినిమా ఒక పెద్ద డిజాస్టర్ గా అఖిల్ కెరీర్ లో ఉండిపోయింది. రెండో రోజు ఇంత దారుణమైన కలెక్షన్స్ ఏ సినిమాకి ఉండవేమో అంతలా వచ్చాయి. అంటే ఈ సినిమాకి రెవిన్యూ ఏమి రాలేదు అనే అర్థం.
ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.80 కోట్లు అయిందని అంచనా, ఈ సినిమా థియేట్రికల్ హక్కులు సుమారు రూ.37 కోట్లకు అమ్మినట్టుగా తెలిసింది. రెండో రోజు కనీసం కరెంట్ ఛార్జీలకు కూడా రాణి రెవిన్యూ, ముందు ముందు ఇంకెక్కడ కలెక్టు చేసింది. అందుకని నిర్మాతకి పెద్ద లాస్ ఈ సినిమా. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఇందులో పార్టనర్. దీనికి అనిల్ సుంకర (AnilSunkara) నిర్మాత కాగా, సాక్షి వైద్య (SakshiVaidya) కథానాయకురాలిగా ఆరంగేట్రం చేసింది.