Allu Aravind: అంతా నాదే అనుకోకూడదు.. స్పేస్ క్రియేట్ చేయాలి!
ABN , First Publish Date - 2023-06-02T13:23:30+05:30 IST
తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల గురించి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నోవేటివ్ థాట్స్‌తో కొత్తగా వస్తున్న నిర్మాతలు ఎదగడానికి స్కోప్ క్రియేట్ చేయాలని ఆయన అన్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో (TFi) నిర్మాతల గురించి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (allu Aravind) ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నోవేటివ్ థాట్స్‌తో కొత్తగా వస్తున్న నిర్మాతలు ఎదగడానికి స్కోప్ క్రియేట్ (space creat for Young producers) చేయాలని ఆయన అన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘2018’ సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ‘‘నేను గానీ, దిల్ రాజు (dil raju) సహా ఇతర నిర్మాతలు చేయాల్సింది ఏంటంటే... జూనియర్స్‌కు స్పేస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ కోసం అవకాశాల్ని క్రియేట్ చేయాలి. అందులో వారు ఎదుగుతారు. మనమే అంతా ఆక్రమించేసి, ఎవరూ పైకి రాకుండా పేరు, డబ్బు మొత్తం మనకే వచ్చేయాలనుకుంటే కరెక్ట్ కాదు. నేను కూడా తెలివి తేటలతో గ్రహించి పక్కన్న వాళ్లకు స్పేస్ ఇస్తున్నా. అలా అవకాశం ఇచ్చే యాటిట్యూడ్ నాకుంది. ఈ విషయంపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ నేను, దిల్ రాజు, మరికొందరు నిర్మాతలు వెనకున్న కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్నాం’’ అని అన్నారు.
ఇటీవల ఆయన బ్యానర్ ద్వారా విడుదల మలయాళ హిట్ చిత్రం ‘2018’ (2018 Movie) తెలుగులో సక్సెస్ అవ్వడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మంచి కథ ఉంటే స్టార్ హీరోలు, పాటలు, ఫైట్లతో పనిలేదన్నారు. ‘2018’ చిత్రం అవేమీ లేకపోయినా హిట్ కావడానికి బలమైన భావోద్వేగాలే కారణం. సినిమా చూస్తున్నంత సేపు తుపాన్లో ఉన్నట్లు అనిపించింది అని అన్నారు.