Allu Arjun - Shah Rukh khan : మూడు రోజుల్లో మూడుసార్లు.. చూశా.. చాలా నేర్చుకున్నా!

ABN , First Publish Date - 2023-09-14T16:08:56+05:30 IST

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్‌’ చిత్రం రికార్డులు పరంగా సంచలనం సృష్టిస్తోంది. సినిమా సాధిస్తున్న విజయంతో షారుక్‌పై పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘జవాన్‌’పై పొగడ్తలు కురిపించారు.

Allu Arjun - Shah Rukh khan : మూడు రోజుల్లో మూడుసార్లు.. చూశా..  చాలా నేర్చుకున్నా!

బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్‌’ చిత్రం రికార్డులు పరంగా సంచలనం సృష్టిస్తోంది. సినిమా సాధిస్తున్న విజయంతో షారుక్‌పై పలువురు సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై అల్లు అర్జున్‌ స్పందించారు. ‘జవాన్‌’పై పొగడ్తలు కురిపించారు. సినిమా టీమ్‌ అందరిపీ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా షారుక్‌, అల్లు అర్జున్‌ మధ్య నడిచిన సంభాషణ నెటిజన్‌లను ఆకట్టుకుంటుంది. ‘‘మీ కెరీర్‌లోనే ఇది ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. మీ స్టైల్‌తో భారతదేశం మొత్తాన్ని ఉర్రూతలూగించారు. మిమ్మల్ని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇలానే చూడాలని కోరుకుంటున్నా. విజయ్‌ సేతుపతి ఎప్పటిలానే తన అద్భుతమైన నటనతో అదరగొట్టారు. దీపికా పదుకొణె, నయనతార వారి అందంతో అలరించారు. అనిరుద్‌ సంగీతం మైమరపించాడు. దర్శకుడు అట్లీకి పెద్ద కంగ్రాట్స్‌. ఇలాంటి కమర్షియల్‌ సినిమాలతో ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడుతున్నాం’ అని ట్వీట్‌ చేశారు.

బన్నీ ట్వీట్‌కు షారుక్‌ స్పందించారు. ‘‘మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో సంతోషంగా ఉంది. మీ ట్వీట్‌తో ‘జవాన్‌’ విజయాన్ని రెండోసారి ఆస్వాదిస్తున్నాను. మీరు నటించిన ‘పుష్ప’ సినిమాను మూడురోజుల్లో మూడు సార్లు చూశాను. దాని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. వీలైనంత త్వరలో మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి నా ప్రేమను తెలియజేస్తాను. లవ్‌ యూ’ అని షారుక్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతే కాదు అల్లు అర్జున్‌ ట్వీట్‌కు అనిరుధ్‌ థ్యాంక్స్‌ చెప్పారు. దానికి బన్నీ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ‘కేవలం థ్యాంక్స్‌ చెబితే కుదరదు. నాకూ మంచి పాటలు అందించాలి’ అనగా రెడీ అంటూ అనిరుద్‌ సమాధానమిచ్చారు.

Updated Date - 2023-09-14T16:19:31+05:30 IST