Polimera2: ‘మా ఊరి పొలిమేర2’ సక్సెస్.. వంశీని అభినందించిన అల్లు అరవింద్

ABN , First Publish Date - 2023-11-09T20:22:40+05:30 IST

మాఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం “మా ఊరి పొలిమేర 2”. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో న‌టించిన ఈ చిత్రం విడుద‌లైన రోజు నుంచి ప్రేక్షకాద‌ర‌ణ‌తో బ్లాక్‌ బ‌స్టర్ విజ‌యం దిశ‌గా చిత్రం కొన‌సాగుతుంది. గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వంశీ నందిపాటిని అభినందించారు.

Polimera2: ‘మా ఊరి పొలిమేర2’ సక్సెస్.. వంశీని అభినందించిన అల్లు అరవింద్
POLIMERA2

మాఊరి పొలిమేర (maa oori polimera2)’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం “మా ఊరి పొలిమేర 2”. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించగా డా.అనిల్ విశ్వనాథ్ ద‌ర్శకత్వం వహించగా గౌరీ కృష్ణ నిర్మించారు. గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుద‌లైన రోజు నుంచి ప్రేక్షకాద‌ర‌ణ‌తో బ్లాక్‌ బ‌స్టర్ విజ‌యం దిశ‌గా చిత్రం కొన‌సాగుతుంది.


ఈ సంద‌ర్భంగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వంశీ నందిపాటిని అభినందించారు. మంచి అభిరుచి గల వ్యక్తి వంశీ అని, మొదటి ప్రయత్నంలోనే చిరస్మరణీయమైన హిట్ అందుకోవడం ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు.

అయితే సినిమాను ఇంతటి కమర్షియల్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు 'మా ఊరి పొలిమేర 2' టీమ్ నవంబర్ 10 నుంచి ఆంధ్రాలో పర్యటించనుందని తెలియజేశారు.

Updated Date - 2023-11-09T22:29:48+05:30 IST