Allu Aravind: అలాంటి కథ కుదిరితే.. 200శాతం బన్నీతో తీస్తా!
ABN , First Publish Date - 2023-06-01T16:22:48+05:30 IST
గీతా ఆర్ట్స్ టాలీవుడ్లో బ్రాండ్ ఉన్న నిర్మాణ సంస్థ. ఆ సంస్థ అధినేత అల్లు అరవింద్ ఓ కథ లాక్ చేశారంటే.. అందులో మంచి విషయం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం. ఆ బ్యానర్లో వచ్చే చిత్రాలూ ఆ నమ్మకానికి తగ్గట్లే ఉంటాయి. ప్రస్తుతం గీతా బ్యానర్‌కు అనుబంధ సంస్థలైన జీఎ2 పిక్చర్స్ నుంచి పలు చిత్రాలు సెట్స్ మీదున్నాయి.
గీతా ఆర్ట్స్ (geetha arts)టాలీవుడ్లో బ్రాండ్ ఉన్న నిర్మాణ సంస్థ. ఆ సంస్థ అధినేత అల్లు అరవింద్ ఓ కథ లాక్ చేశారంటే.. అందులో మంచి విషయం ఉంటుందనే ప్రేక్షకుల నమ్మకం. ఆ బ్యానర్లో వచ్చే చిత్రాలూ ఆ నమ్మకానికి తగ్గట్లే ఉంటాయి. ప్రస్తుతం గీతా బ్యానర్‌కు అనుబంధ సంస్థలైన జీఎ2 పిక్చర్స్ నుంచి పలు చిత్రాలు సెట్స్ మీదున్నాయి. మరోపక్క అనువాద చిత్రాల్లోనూ గీతా సంస్థ హవా చూపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యానర్లో ఐదారు చిత్రాలు పైప్‌లైన్‌లో ఉన్నాయి. తాజాగా గీత ఆర్ట్స్ సంస్థ నుంచి కేరళలో విజయం సాధించిన ‘2018’(2018 movie) చిత్రం విడుదలైంది. తెలుగులో కూడా ఈ చిత్రం సూపర్‌హిట్ టాక్‌తో నడుస్తోంది. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడారు. తన వల్ల కెరీర్లో ఎంతోమంది పైకి వచ్చారని, కెరీర్లో వృద్థి చెందిన తర్వాత కొందరు మాత్రం ఆ సంగతి మర్చిపోయి గీత దాటి వెళ్లి వేరే సినిమాలు చేశారని ఆయన అన్నారు. వాళ్ల పేర్ల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదని అన్నారు. ‘‘కేరళలో హిట్ అయిన ‘2018’ చిత్రాన్ని చూసి చాలా ఉద్వేగానికి లోనయ్యా. ‘ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలి... మనమే చేయాలంటూ’ అమెరికాలో ఉన్న నాకు బన్నీ వాస్ ఫోన్ చేసి చెప్పాడు. ఈ సినిమా చూసి ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యా. ఈ సినిమా సక్సెస్‌కి కారణం.. ఉద్వేగం, హ్యూమన్ ఎమోషన్స్(Human emotions). అయితే అందరూ ఈ చిత్రాన్ని థియేటర్లోనే వీక్షించి.. ఆ అనుభూతిని పొందాలి. భవిష్యత్తులో ఇలాంటి కథ కుదిరితే 200 శాతం బన్నీతో సినిమా తీస్తా’’ అని అన్నారు. అలాగే గీతా ఆర్ట్స్‌లో తదుపరి చిత్రాల గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఐదారు చిత్రాలు క్యూలో ఉన్నాయి.
బోయపాటి నెక్ట్స్ మా బ్యానర్లోనే... (Boyapati next movie)
బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయాల్సి ఉంది. తదుపరి చిత్రం మా బ్యానర్లోనే ఉంది. ఆయన తయారు చేసిన కథకు ఇద్దరు హీరోలను అనుకున్నాం. ప్రస్తుతం ఆయన స్ర్కిప్ట్ వర్క్ చేస్తున్నారు. అలాగే సురేందర్ రెడ్డి కూడా మా బ్యానర్లో ఓ సినిమా ఉంది. అది కూడా స్ర్కిప్ట్ వర్కులో ఉంది. అవన్నీ ఓ దార్లోకి వచ్చాక వివరాలు వెల్లడిస్తాం. చందూ మొండేటితో రెండు ప్రాజెక్ట్‌లు లాక్ అయ్యాయి. అందులో ఒక సినిమాను రూ.200 - 300 కోట్ల బడ్జెట్లో ప్లాన్ చేస్తున్నాను. చందూ సినిమా విడుదలై ఏడాది కావొస్తుంది. అతనికి బయటి నుంచి టెమ్టింగ్ ఆఫర్స్ ఎన్ని వచ్చినా.. ఇచ్చిన మాట కోసం మా బ్యానర్లోనే ఉన్నాడు. నా సినిమా పూర్తయ్యాకే వేరే ప్రాజెక్ట్ టేకప్ చేస్త్తానని ఫిక్స్ అయ్యారు’’ అని అరవింద్ తెలిపారు.