Anasuya : అమెరికా వెళ్లినా అస్సలు తగ్గేదేలే అంటున్న అనసూయ.. ఈసారి ఏం చేసిందో తెలిస్తే..?
ABN , First Publish Date - 2023-07-13T19:48:08+05:30 IST
గత నెల పెళ్లి రోజు సందర్భంగా థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి బీచ్‌లో బికినీ ధరించి హాట్‌హాట్ ఫోటోలతో యువతను రెచ్చగొట్టిన యాంకర్, నటి అనసూయ మరోసారి అలాంటి ప్రయత్నమే చేసింది. ఇటీవల ఆమె అమెరికా వెళ్లింది. ప్రస్తుతం వాషింగ్టన్లో సేద తీరుతోంది. అక్కడి వీధుల్లో సరదాగా షికార్లు కొడుతోంది.
గత నెల పెళ్లి రోజు సందర్భంగా థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి బీచ్‌లో బికినీ ధరించి హాట్‌హాట్ ఫోటోలతో యువతను రెచ్చగొట్టిన యాంకర్, నటి అనసూయ (Anasuya) మరోసారి అలాంటి ప్రయత్నమే చేసింది. ఇటీవల ఆమె అమెరికా (USA tour) వెళ్లింది. ప్రస్తుతం వాషింగ్టన్లో సేద తీరుతోంది. అక్కడి వీధుల్లో సరదాగా షికార్లు కొడుతోంది. చిన్న టాప్, షార్ట్ వేసుకుని నడుమ, నాభి అందాలను చూపిస్తూ విశాలమైన సీయటెల్ రోడ్లపై సందడి చేస్తోంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ‘సీయటెల్ నగరంలో నా మానసిక పరిస్థితి’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు అనసూయ నడుయ అందాలకు ఫిదా అవుతుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. ‘‘ఇక నువ్వు మారవా? ఎక్కడికి వెళ్లినా ఎక్స్‌పోజింగ్‌తోనే జనాల్ని ఆకర్షిస్తావా? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అబ్బా అనసూయ నిద్ర లేకుండా చేస్తున్నావ్ అని ఓ నెటిజన్ కామెంట్ చేయడా... ‘నీ నడుమ నేషనల్ హైవేలా ఉంది’ అంటూ కామెంట్ పోస్ట్ చేశారు. మరి కామెంట్స్ చూసి అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇటీవల ఆమె నటించగా విడుదలైన ‘విమానం’ చక్కని గుర్తింపు పొందింది. ఇందులో సుమతి అనే వేశ్యగా అనసూయ నటించింది. దీనిలో ఆమెది చిన్న పాత్రే అయిన తన గ్లామర్ షోతోపాటే ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొట్టింది అనసూయ.
ఇక అనసూయకు వివాదాలు కొత్తేమీ కాదు. తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పంచాయతీ ఉంటూనే ఉంటుంది. తనను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి అనసూయ ఇటీవల ఓ ట్వీట్ చేసింది. ‘‘నువ్వు నన్ను తిడితే నీ కంపు నోరు తప్పవుతుంది కానీ నేనెలా తప్పవుతాను? నా పెంపకం గర్వించదగ్గది.. నా అభిప్రాయాన్ని ధైర్యంగా గౌరవపూర్వకంగా చెప్పటం నేర్పింది. మీ పెంపకం ఎలాంటిదో మీరే అర్థం చేసుకోండి’ అని ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.