Anil Ravipudi: చెప్పింది చేయకపోతే చంపేస్తా అంటూ...

ABN , First Publish Date - 2023-07-23T15:26:16+05:30 IST

నటుడు బ్రహ్మాజీ దర్శకుడు అనిల్‌ రావిపూడిని బెదిరించారు. పీక మీద కత్తి పెట్టి భయం పుట్టించారు. తన చెప్పింది చేయకపోతే కంఠం కోస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి విపరీతంగా నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

Anil Ravipudi: చెప్పింది చేయకపోతే చంపేస్తా అంటూ...

నటుడు బ్రహ్మాజీ (Brahmaji) దర్శకుడు అనిల్‌ రావిపూడిని (Anil Raavipudi) బెదిరించారు. పీక మీద కత్తి పెట్టి భయం పుట్టించారు. తన చెప్పింది చేయకపోతే కంఠం కోస్తానని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి విపరీతంగా నవ్వుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే... బ్రహ్మాజీ తనయుడు కథానాయికుడిగా తెరకెక్కిన ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ (Slum dog husbend) చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో బ్రహ్మాజీ ప్రమోషన్‌లో భాగంగా ఇలా చేశారు. ఇందులో భాగంగా బ్రహ్మాజీ, అనిల్‌ రావిపూడితో చిన్న స్కిట్‌ చేశారు. షూటింగ్‌లో ఉన్న అనిల్‌ రావిపూడి దగ్గరకు వెళ్లి అన్నా.. ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ రిలీజ్‌ డేట్‌ గురించి చిన్న వీడియో బైట్‌ కావాలని కోరతారు. ‘ఎన్నిసార్లు చెప్పాలయ్యా.. మొన్న ఫ్రీ రిలీజ్‌ ఈవెంట్‌ అన్నావ్‌.. ఇప్పుడు వీడియో అంటున్నావ్‌.. నాకు చిరాగ్గా ఉంది వెళ్లిపో అన్నా’ అంటూ అనిల్‌ దానికి తిరస్కరించడంతో బ్రహ్మాజీ అతడి మెడపై కత్తి పెట్టి బెదిరిస్తారు.

2.jpg

దీంతో అనిల్‌ రావిపూడి జులై 29న ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’ రిలీజ్‌ అవుతుంది. అందరూ తప్పక చూడండి’ అని చెబుతారు. సరదాగా సాగిన ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌రావు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌’. ఏ.ఆర్‌.శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రణవి మానుకొండ కథానాయిక. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - 2023-07-23T15:26:16+05:30 IST