RGV: సోషల్ మీడియాలో హడావిడి చెయ్యడానికి పనికొస్తుంది ఈ 'వ్యూహం'

ABN , First Publish Date - 2023-06-24T11:58:41+05:30 IST

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటాడు. అందుకనే ఏవేవో సినిమాలు తీసి వైస్సార్సీపీ, లేదా వైస్ జగన్ మెప్పు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ పార్టీ నుండి వచ్చిన ఫండ్స్ తో ఈమధ్య ఆర్జివీ డెన్ ఒకటి కట్టాడు అని వార్తలు నడుస్తున్నాయి, ఇప్పుడు అదే ఫండ్ తో ఆ పార్టీ కోసం ఈ 'వ్యూహం' సినిమా అని అంటున్నారు.

RGV: సోషల్ మీడియాలో హడావిడి చెయ్యడానికి పనికొస్తుంది ఈ 'వ్యూహం'
Ram Gopal Varma

రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ అయినా వైస్సార్సీపీ (YSRCP) కి డిజిటల్ హెడ్ లా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే వర్మ (RGV) ఈ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినా, అయన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న కంటెంట్, అయన సాంఘీక మాధ్యమాల్లో చేస్తున్న ట్వీట్స్ ఇవన్నీ అధికార వైస్సార్సీపీ కి అనుకూలంగా ఉన్నాయని అందరూ ఆమోదించిన విషయం కదా.

vyooham.jpg

అప్పట్లో 'లక్ష్మిస్ ఎన్టీఆర్' #LakshmisNTR అనే సినిమా తీసి, అందులో నిజాలు పక్కన పెట్టి, తనకు తోచిన విధంగా తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (ChandrababuNaidu) ని విలన్ లా చూపించాడు వర్మ. ఇప్పుడు మళ్ళీ అదే ఆలోచనతో 'వ్యూహం' #Vyooham అనే సినిమా టీజర్ ఈరోజు విడుదల చేసాడు. అయితే ఈ సినిమా పూర్తయిందో లేదో, తెలియదు కానీ, వర్మకి ప్రచారాలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఈరోజు టీజర్ విడుదల చేసాడు.

ఈ టీజర్ లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి (YSRajasekharReddy) హెలికాఫ్టర్ దుర్ఘటనలో మరణించడం, అది తట్టుకోలేక కొంతమంది వైస్సార్ అభిమానులు మరణించటం, జగన్ (YSJagan) ఓదార్పు యాత్ర చూపించాడు. చివర్లో డైలాగ్ 'ఆలా ఆలోచించడానికి చంద్రబాబును కాదు' అని పెట్టాడు. ఇది కచ్చితంగా వైస్సార్సీపీ కి ఇంకో ప్రచార చిత్రంగా వర్మ తీస్తున్నాడు అని అర్థం అయిపోతోంది. వైసీపీ మనిషి, టీటీడీ బోర్డు మెంబరు అయిన దాసరి కిరణ్ కుమార్ (DasariKiranKumar) దీనికి నిర్మాత. అందుకని ఈ సినిమాలో మళ్ళీ నిజాలు పక్కన పెట్టేసి, వర్మ తన స్టైల్ లో జగన్ కి ఉపయోగపడేట్టు, తెలుగు దేశాన్ని విలన్ గానూ చూపించనున్నాడని అందరికీ తెలిసిన విషయమే.

vyooham1.jpg

అయితే ఇలాంటి సినిమాలు గతంలో కూడా చాలా చేసాడు వర్మ, కానీ వాటిని ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. ఒక్కరోజు కూడా ఆ సినిమాలు ఏవీ ఆడలేదు. ఎప్పుడైనా సినిమాలో కొంచెం నిజాలు ఉంటే ప్రేక్షకుల ఆదరిస్తారు కానీ, వూరికే ఒక పార్టీకి, వ్యక్తికి ప్రచారం కోసం తీసే చిత్రాలు ఏవీ నడవవు అని ఈమధ్య కాలంలో రుజువయింది. అందుకని వర్మ తీస్తున్న ఈ 'వ్యూహం' #Vyhooam కూడా సాంఘీక మాధ్యమాల్లో హడావిడికి తప్పితే ఎందుకూ పనికిరాదు అని పరిశ్రమలో టాక్.

Updated Date - 2023-06-24T11:58:41+05:30 IST