Akkineni Nageswara Rao: ఈమధ్య కొన్ని సినిమాల్లో వస్తున్న భాష ఏమాత్రం బాగోలేదు: వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2023-09-20T13:58:01+05:30 IST

అక్కినేని నటన, వ్యక్తిత్వం, మానవతా విలువల గురించి ఎంతో గొప్పగా చెప్పారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అక్కినేని నుండి స్ఫూర్తి పొంది కొంతైనా అందరూ అమలుపరిస్తే వారి జీవితాలు బాగుంటాయని అంటూ, ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అశ్లీలం, రెండర్థాల భావాలు ఉంటున్నాయని విమరిస్తూ, తెలుగు భాషని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందని చెప్పారు.

Akkineni Nageswara Rao: ఈమధ్య కొన్ని సినిమాల్లో వస్తున్న భాష ఏమాత్రం బాగోలేదు: వెంకయ్యనాయుడు
M Venkaiah Naidu unveiling the statue of Akkineni Nageswara Rao

అక్కినేని శత జయంతి సందర్భంగా ఈరోజు మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు (MVenkaiahNaidu) అక్కినేని నాగేశ్వర (AkkineniNageswaraRao) రావు విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని కుటుంబ సభ్యులు, చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన నటులు, దర్శకులు, సాంకేతికనిపుణులు, ఇతర రంగాల వారి నడుమ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అక్కినేని లోని వ్యక్తిత్వాన్ని కొంచెం అయినా నేర్చుకొని అవి అమలు చేస్తే అదే ఆయనికి ఇచ్చిన నివాళి అని అన్నారు. #CelebratingANR100

అక్కినేని నాగేశ్వరరావు #ANRLivesOn నటుల్లో మహా నటుడు, మనిషిలో మహామనిషి, నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం వుంది. అనేక విషయాలపైన మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం మేము. జీవితమంతా నటిస్తూనే వున్నారు, జీవితంలో ఆఖరి రోజు వరకు నటించిన నటుడు నాకు తెలిసి మరెవరు లేరు, అని అక్కినేని గురించి చెప్పారు వెంకయ్యనాయుడు. సినిమా రంగంలో విలువలు పాటించి, చూపించి కొన్ని మంచి సంప్రదాయాలు మనముందు పెట్టిన వారిలో సజీవ మనిషి అక్కినేని అని చెప్పారు.

mvenkaiahnaidu.jpg

అక్కినేని నాగేశ్వర రావు గారికి నిజమైన నివాళి ఇవ్వటం అంటే, అతని చూపించిన ఆ బాష, వేషం, నటన, వ్యక్తిత్వం కొంతైనా అందిపుచ్చుకుంటే అదే అతనికి నిజమైన నివాళి. అయన చక్కని తెలుగు మాట్లాడేవారు, అలాగే నాకు తెలుగంటే చాలా ఇష్టం, అక్కినేని పిల్లలు అందరూ తెలుగులో మాట్లాడటం చూసి నాకు సంతోషం వేసింది, అని చెప్పారు వెంకయ్యనాయుడు. ఈరోజు తెలుగు భాషని పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు, అని విమర్శించారు. భాష పోతే శ్వాస పోతుంది, శ్వాస పోతే, అసలే పోతుంది అందుకే భాషని ఎప్పుడూ మరిచిపోకూడదు. భాష పోతే సినిమా ఉండదు, భాషా పత్రికలూ వుండవు, ఛానళ్ళు వుండవు, భాషని కాపాడుకోవాలి, జీవితంలో అదొక అలవాటుగా, పట్టుదలగా భాషను కాపాడుకోవాల్సి వుంది, దానికి మనం ఏమీ కష్టపడాల్సిన పనిలేదు, మన భాషలో మాట్లాడితే చాలు అని చెప్పారు తెలుగు భాష గురించి.

ఏ రంగంలో వున్నా కొన్ని విలువలు పాటించాలి. అదేమంత కష్టమైనా పనేమీ కాదు, విలువలకి సజీవ దర్పణం అక్కినేని నాగేశ్వర రావు గారు. అయన పిల్లలని కూడా బాగా పెంచారు. గుడివాడకు ఇటు అటు పుట్టిన ఇద్దరు వ్యక్తులు అక్కినేని నాగేశ్వర రావు, నందమూరి తారక రామారావు, ఆ ఇద్దరూ కళామతల్లికి రెండు కన్నులవంటి వారు అయ్యారు. నాగేశ్వర రావు గారు ఎప్పుడూ తన జీవితాన్ని మెరుగుపరచుకునేవారు, మధించుకునేవారు, దానివల్ల తన వ్యక్తిత్వాన్ని ఇంప్రూవ్ చేసుకునేవారు.

నాగేశ్వర రావు గారు ఒక నటనా విశ్వవిద్యాలయం, ఇక్కడకి వచ్చిన వాళ్ళు విద్యార్ధి అనుకొని అయన నుంచి కొన్నిటిలో అయినా స్ఫూర్తి పొంది వాటిని అందించుకుంటే తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోగలరు. అయన నాస్తికుడు అయినా, గొప్ప తాత్వికుడు, అలాగే ఎప్పుడూ కొత్తదనం కోరుకునే తత్వం, దానిని అనుసరించి ముందుకు సాగటం అయన జీవితం.

సినిమాలలో వినోదం ఉండాలి, కానీ వినోదం తో పాటు విజ్ఞానం కూడా ఉండాలి. కానీ ఈమధ్య కొన్ని సినిమాల్లో వాడుతున్న భాష ఏమాత్రం బాగోలేదు. రెండర్ధాలు కనిపించే విధంగా ఉంటున్నాయి, అస్లీల సన్నివేశాలని పెడుతున్నారు, అవి లేకపోయినా సినిమాలు బాగా ఆడతాయి, కానీ అవి పెడుతున్నారు. అందుకని దర్శకులు, రచయితలు, పాటలు రాసేవాళ్ళు ఒక విజ్ఞానంతో కూడిన వినోదం ఉండేట్టు గుర్తించి రాయాలి. ఎందుకంటే ఈరోజు సమాజం మీద సినిమా ప్రభావం చాలా వుంది, ని సినిమా ద్వారా స్ఫూర్తిని సులభంగా అందించవచ్చు, అని సినిమారంగలో ఉన్నవాళ్ళకి విజ్ఞప్తి చేశారు వెంకయ్య నాయుడు.

స్పూర్తితో విలువలను, సంప్రదాయాలని, భాషను, కట్టుబాట్లని, వ్యక్తిత్వాన్ని మన పిల్లలకి నేర్పిస్తే బాగుంటుంది. నేను రాజకీయాల్లో వారసత్వానికి వ్యతిరేకం, కానీ సినిమాల్లో, వైద్యంలో మాత్రం వారసత్వాన్ని ప్రోత్సహిస్తాను. ఎందుకంటే ఈ రంగాల్లో బాగా కష్టపడాలి. అక్కినేని వారసత్వాన్ని మాత్రం అక్కినేని వారసులు బాగా నిలబెడుతున్నారు అని చెప్పారు.

Updated Date - 2023-09-20T13:58:01+05:30 IST