ANR Lives on: అతిరధ మహారథుల మధ్య అక్కినేని విగ్రహావిష్కరణ
ABN , First Publish Date - 2023-09-20T11:12:11+05:30 IST
ఈ సంవత్సరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి సంవత్సరం. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబ సభ్యులు అక్కినేని విగ్రహం అన్నపూర్ణ స్టూడియోలో పెట్టాలని నిర్ణయించారు. ఈ విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు.
సెప్టెంబర్ 20, 1924 భారత చలన చిత్ర పరిశ్రమలో మహానటుడు అయిన అక్కినేని నాగేశ్వర రావు (AkkineniNageswaraRao) పుట్టినరోజు. అంచెలంచెలుగా ఎదిగి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ముఖ్య భాగం అయ్యారు అక్కినేని. సాంఘికం, పౌరాణికం, సోషియో ఫాంటసీ, చారిత్రాత్మక, భక్తిరస సినిమాలు అన్నిటిలో నటించి తనదైన ముద్ర వేసుకొని, తెలుగు చలన చిత్ర పరిశ్రమని ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశం, ప్రపంచం అంతా చాటి చెప్పిన నటుడు అక్కినేని నాగేశ్వర రావు. #ANRLivesOn
ఈరోజు అంటే సెప్టెంబర్ 20, 2024 న అక్కినేని శతజయంతి సంవత్సరాల సందర్భంగా అతను స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ లో అతని కుటుంబం కుమారులు అక్కినేని వెంకట్, నాగార్జున (AkkineniNagarjuna), కుమార్తెలు మిగతా కుటుంబ సభ్యులు అందరూ అక్కినేని విగ్రహం పెట్టాలని నిశ్చయించి ఈరోజు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. #CelebratingANR100
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ విగ్రహావిష్కరణ చేశారు. అలాగే చిత్ర పరిశ్రమ నుండి కథానాయకులు, నిర్మాతలు, దర్శకులు, నాగేశ్వర రావు గారితో అనుబంధం వున్నవారు, అలాగే అభిమానులు ఇంతమంది సమక్షంలో ఈరోజు అక్కినేని నాగేశ్వర రావు గారి విగ్రహావిష్కరణ జరిగింది. అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు. అలాగే పరిశ్రమ నుండి మహేష్ బాబు (MaheshBabu), రామ్ చరణ్ (RamCharan), నాని (Nani), మంచు విష్ణు (ManchuVishnu), జగపతి బాబు, బ్రహ్మానందం (Brahmanandam), కీరవాణి ఇలా చాలామంది ఈ ఫంక్షన్ కి హాజరైన వారిలో వున్నారు.