Anupama parameswaran: నెటిజన్‌ వింత ప్రశ్న.. చెంప పగులగొట్టినట్లు రిప్లై

ABN , First Publish Date - 2023-06-11T16:41:40+05:30 IST

మలయాళ బ్యూటీ, అల్లరి పిల్ల అనసూయ పరమేశ్వరన్‌ తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగుతోపాటు సౌత్‌ అన్ని భాషల ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ నెటిజన్‌ అనుకు ఒళ్లు మండే డైలాగ్‌ వేశాడు. దీనికి అనుపమ ఎంతో వినయంగా, తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

Anupama parameswaran: నెటిజన్‌ వింత ప్రశ్న.. చెంప పగులగొట్టినట్లు రిప్లై

మలయాళ బ్యూటీ, అల్లరి పిల్ల అనసూయ పరమేశ్వరన్‌(Anupama parameswaran) తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగుతోపాటు సౌత్‌ అన్ని భాషల ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిట్‌ చిత్రాలు ఎన్ని ఉన్నా.. స్టార్‌ హీరోతో నటించే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది ‘కార్తికేయ 2’ (Karthikeya 2) సినిమాతో పాన్‌ ఇండియా హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. తర్వాత ‘18 పేజీస్‌’ చిత్రంలో నటించింది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టవ్‌గా ఉంటే ఈ అల్లరి పిల్ల అనూ ఎప్పటికప్పుడు తన గురించి సోషల్‌ మీడియా ద్వారా తెలియజేస్తుంటారు. తాజాగా ఓ నెటిజన్‌ అనుకు ఒళ్లు మండే డైలాగ్‌ వేశాడు. ‘నువ్వు పెద్ద హీరోయిన్‌వి ఏమీ కాదు.. అందుకే భారీ చిత్రాల్లో అవకాశాలు రావడం లేదు. హీరోయిన్‌ మెటీరియల్‌ కాదు’ అని కామెంట్‌ చేశాడు. దీనికి అనుపమ ఎంతో వినయంగా, తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

2.jpg

‘మీరు చెబుతుంది కరెక్టే అన్నా.. నేను హీరోయిన్‌ టైప్‌ కాదు, నేను యాక్టర్‌ టైప్‌’ అని చెంప పగులగొట్టినట్లు సమాధానమిచ్చి స్మైలీ ఎమోజీలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనుపమకు మద్థతుగా కామెంట్స్‌ చేస్తున్నారు. అనుపమా టాలెంట్‌ ఉన్న నటే కాదు. బ్రెయిన్‌ విత్‌ బ్యూటీ అంటూ ఆమెను పొగుడుతున్నారు. ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్‌ ‘టిల్లు స్వ్కేర్‌’, చిత్రంతోపాటురవితేజ రాబోయే భారీ యాక్షన్‌ సినిమాలో ఛాన్స్‌ అందుకొంది.

Updated Date - 2023-06-11T16:49:32+05:30 IST