Ram charan: బాలీవుడ్ దర్శకుడు ఏమన్నాడంటే
ABN , First Publish Date - 2023-05-30T17:05:12+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్‌స్టార్‌గా ఎదిగారు రామ్ చరణ్. ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన పోషించిన సీతారామరాజు పాత్రలో యావత్ దేశాన్ని అలరించారు. బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రంతో గ్లోబల్‌స్టార్(Global star)గా ఎదిగారు రామ్ చరణ్ (Ram charan). ‘ఆర్ఆర్ఆర్’లో ఆయన పోషించిన సీతారామరాజు పాత్రలో యావత్ దేశాన్ని అలరించారు. గ్లోబల్గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా (Apoorva Lakhia) రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘జంజీర్’ (Zanjeer)చిత్రం వచ్చింది. తెలుగులో ‘తుఫాన్’(toofan)గా విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం రామ్‌చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. దాంతో చరణ్ ఈ దర్శకుడిని దూరం పెట్టాడని అప్పట్లో ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న అపూర్వ లఖియా ఈ విషయంపై మాట్లాడారు.
‘‘రామ్ చరణ్, నేను మంచి స్నేహితులం. ‘జంజీర్’ (Zanjeer) తర్వాత కూడా నేను ఎన్నోసార్లు కలిశాం. నేను వాళ్లింటికి వెళ్లాను. వాళ్లింట్లో చాలా రోజులు బస చేశాను. ఇప్పుడు చరణ్ నా ఫోన్ తీయడం లేదు. ఎందుకంటే తను సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.. పైగా అతనికి ఎక్కువగా ఫోన్లకు ఆన్సర్ చేేస అలవాటు లేదు. ఉపాసన నా ఫోన్ ఆన్సర్ చేస్తుంది. మా మధ్య ఎలాంటి విభేదాల్లేవు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ సమయంలో కూడా మేం మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చరణ్ నాకు ఫోన్ చేశాడు. యాక్షన్ సన్నివేశాల గురించి చర్చించుకున్నాం. హైదరాబాద్‌కు ఇప్పుడు వెళ్లినా అతడు నన్ను కలుస్తాడు’’ అని తెలిపారు.