Ariyana Glory: జీవితం అంత సులభం కాదు!

ABN , First Publish Date - 2023-05-12T14:49:01+05:30 IST

యాంకర్‌గా, నటిగా కెరీర్‌ ప్రారంభించిన బ్యూటీ అరియానా గ్లోరి. హాట్‌హాట్‌ దుస్తుల్లో రామ్ గోపాల్ వర్మతో జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ ఆమె చేసిన ఇంటర్వ్యూతో ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే!

Ariyana Glory: జీవితం అంత సులభం కాదు!

యాంకర్‌గా, నటిగా కెరీర్‌ ప్రారంభించిన బ్యూటీ అరియానా గ్లోరి(Ariyana Glory). హాట్‌హాట్‌ దుస్తుల్లో రామ్ గోపాల్ వర్మ(RGV)తో జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ ఆమె చేసిన ఇంటర్వ్యూతో ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే! దాంతో బిగ్‌బాస్‌ (BIGGBOSS) షోలో అవకాశం దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసే ఆమె షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. తాజాగా అరియానా అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా స్వయంగా ఇన్‌స్టా వేదికా (Ariyana suffering with Dengue Fever)వెల్లడించింది.

‘జీవితాన్ని డీల్‌ చేయడం అంత ఈజీగా కాదు. చాలారోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నా. ప్రస్తుతం కోలుకుంటున్నా. మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ప్రియమైన వారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. దోమలు ఉంటాయి జాగ్రత్త వహించండి’ అని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. అభిమానులు స్నేహితులు, అరియానా త్వరగా కోలుకోవాలని మెసేజ్‌లు పెడుతున్నారు.

Updated Date - 2023-05-12T16:35:29+05:30 IST