Balagam: ఆనంద భాష్పాలతో మీ వేణు.. ఏం జరిగిందో తెలుసా?
ABN , First Publish Date - 2023-04-02T18:34:15+05:30 IST
జబర్దస్త్ కమెడీయన్, దర్శకుడు వేణు (Venu) భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఆనందభాష్పాలతో మీ వేణు’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
జబర్దస్త్ కమెడీయన్, దర్శకుడు వేణు (Venu) భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఆనందభాష్పాలతో మీ వేణు’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘బలగం’ (Balagam) చిత్రంతో ఆయన దర్శకుడిగా పరియమైన సంగతి తెలిసిందే! తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పడుతూ తెరకెక్కిన చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టించింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి భారీ వసూళ్లతో బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని పాత రోజుల్లో మాదిరిగా తెరపై ప్రదర్శిస్తున్నారు. థియేటర్లు లేని చాలా ఊళ్లలో ఈ విధానంలో సినిమాను చూసి ఆస్వాదించారు. తాజాగా ఓ ఊరిలో ఈ చిత్రాన్ని తెర కట్టి ప్రదర్శించగా.. దానిని చూసిన గ్రామస్థులందరూ భావోద్వేగానికి లోనయ్యారు. క్లైమాక్స్ చూసి కన్నీటి పర్యాంతమవ్వకుండా ఉండలేకపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘బలగం’ సినిమా ‘బాహుబలి’ కన్నా జనాల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోయింది. ఇప్పట్లో ‘బలగం’ ఆగేలా లేదు’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు దర్శకుడు వేణు స్పందించారు.
‘నా ‘బలగం’ ప్రేక్షకులని ఇలా కదిలిస్తుందని వీడియోలు నాకు పంపిస్తుంటే అదృష్టంగా భావిస్తున్నా. ఇలా చూసి మళ్లీ థియేటర్స్‌కి ఫ్యామిలీతో వెళ్లి చూస్తున్నాం’ అని ఫొటోలు పంపుతున్నారు. ఇంతకుమించి ఏం కావాలి. ఆనంద భాష్పాలతో మీ వేణు’’ అని ట్వీట్ చేశారు. ్అంతే కాదు ఈ చిత్రాన్ని మరో అంతర్జాతీయ పురస్కారం వరించింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ చిత్రం రెండు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్‌ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు అందుకుంది. తాజాగా మరో అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. 'ఒనికో ఫిల్మ్ అవార్డు (ఉక్రెయిన్)’ (Onyko Film Awards) అవార్డ్స్‌లో బెస్ట్ డ్రామా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో పురస్కారం (Best Drama Feature Film award) అందుకోనుంది. దీనికి సంబంధించిన ప్రకటన ఆదివారం సాయంత్రం విడుదలైంది. ఈ విషయాన్ని వేణు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రియదర్శి - కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హన్షిత్, హర్షిత దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో కూడా అందుబాటులో ఉంది.
(Best Drama Feature Film award at Onyko Film Awards in Ukraine)