Mogulayya: ‘బలగం’ మొగులయ్య పరిస్థితి విషమం!
ABN , First Publish Date - 2023-04-11T16:03:54+05:30 IST
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’ సినిమా పతాక సన్నివేశాల్లో ‘తోడుగా మా తోడుండి అంటూ ’గుండెను కదిలించే పాటను పాడిన మొగులయ్య ఆరోగ్య పరిస్థితి విషమించింది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’ (Balagam) సినిమా పతాక సన్నివేశాల్లో ‘తోడుగా మా తోడుండి' అంటూ ’గుండెను కదిలించే పాటను పాడిన మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి విషమించింది. డయాలసిస్ చేస్తున్న సమయంలో గుండె పోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. కరోనా సమయంలో రెండు కిడ్నీలు విఫలమై తీవ్ర అనారోగ్యంతో (mogulayya condition critical) బాధ్యపడుతున్న ఆయనకు రెగ్యులర్గా డయాలసిస్ చేయాల్సి ఉంది. దానికి కూడా ఇప్పుడు ఆ ఆరోగ్యం సహకరించడం లేదని ఇటీవల మొగులయ్య దంపతులు తెలిపారు. ప్రస్తుతం ఆయన వరంగల్లో చికిత్స చికిత్స పొందుతున్నారు. సంరక్ష ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తుండగా గుండె పోటు (Heart attack) వచ్చిందనీ, గుండెకు రక్తం సరఫరా సరిగా జరగడం లేదని వైద్యులు చెప్పారు.
గత 30 ఏళ్లుగా షుగర్, 10 ఏళ్లగా బీపీతో బాధ పడుతున్నారని, ఏడాది క్రితం కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపారు. నెల క్రితం కంటి చూపు పోవడంతో ఇంకా కుంగిపోయారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం స్పందించి మెరుగైన వైద్యం చేయించాలని కోరారు. మెరుగైన వైద్యం కోసం మొగులయ్యను హైదరాబాద్ యశోద ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేస్తున్నామనీ, ఆ మేరకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి యర్రబెల్లి దయాకర్ (Errabeli dayakarrao) చెప్పారు. ఇప్పుడు ఆయన్ను హైదరాబాద్కు తరలించే ప్రయత్నాల్లో ఉన్నారు.
బలగం విడుదల తర్వాత ఆయన ఆర్థికి పరిస్థితి తెలుసుకున్న ‘బలగం’ (Balagam) దర్శకుడు వేణు లక్ష రూపాయలు సాయం అందించిన సంగతి తెలిసిందే! తదుపరి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించి మొగిలయ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.