Bandla Ganesh: దేవుడికి.. భక్తుడిని దూరం చేస్తున్నాడు!

ABN , First Publish Date - 2023-05-27T12:00:15+05:30 IST

పవర్‌ కల్యాణ్‌కి వీరాభిమాని బండ్ల గణేశ్‌. పవన్‌కు భక్తుడిని అని కూడా చెప్పుకొంటారాయన. పవర్‌స్టార్‌ ఆప్త మిత్రుడైన త్రివిక్రమ్‌పై బండ్ల గణేష్‌, ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఏడాది క్రితం ఓ ఆడియో ఫంక్షన్‌ విషయంలో మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తన దేవుడు పవన్‌కు తనకు మధ్య త్రివిక్రమ్‌ గ్యాప్‌ పెంచేశారనేలా ఆయన ట్వీట్లు ఉన్నాయి.

Bandla Ganesh: దేవుడికి.. భక్తుడిని దూరం చేస్తున్నాడు!

పవర్‌ కల్యాణ్‌కి (Pawan kalyan) వీరాభిమాని బండ్ల గణేశ్‌(Bandla Ganesh). పవన్‌కు భక్తుడిని అని కూడా చెప్పుకొంటారాయన. పవర్‌స్టార్‌ ఆప్త మిత్రుడైన త్రివిక్రమ్‌పై (trivikram) బండ్ల గణేష్‌, ట్విట్టర్‌ వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఏడాది క్రితం ఓ ఆడియో ఫంక్షన్‌ విషయంలో మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తన దేవుడు పవన్‌కు తనకు మధ్య త్రివిక్రమ్‌ గ్యాప్‌ పెంచేశారనేలా ఆయన ట్వీట్లు ఉన్నాయి. గతంలోనూ ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ‘మన దేవుడి మంచివాడే.. డాలర్‌ శేషాద్రితోనే ప్రాబ్లమ్‌ ఏం చేద్దాం బ్రదర్‌’ అని చేసిన ట్వీట్‌ దుమారం రేపింది. మధ్యమధ్యలో కూడా బండ్ల ఇలాంటి కామెంట్లు చేశారు. మరోసారి ఆయన సోషల్‌ మీడియా వేదికగా విజృంభిస్తున్నారు. రెండు రోజులుగా బండ్ల గణేష్‌ చేస్తున్న ట్వీట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాను దేవుడి కొలిచే పవన్‌ కళ్యాణ్‌కు, తనకు మధ్య దూరం పెరగడానికి త్రివిక్రమ్‌ కారణం అని పరోక్షంగా చెప్పేందుకు ట్రై చేస్తున్నారు బండ్ల. శనివారం చేసిన రెండ్లు ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. (Bandla Ganesh counters to Trivikram)

సాగినంత కాలం నా అంతవాడు లేడందురు

సాగకపోతే ఊరక చతికిత పడిపోవదురు

చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం’

గురూజీ..(guruji)

భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అంబికా దర్బార్‌ బత్తి

భగవంతుడిని భక్తుడికి దూరం చేసేది గురూజీ దర్బార్‌ సుత్తి

అని బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్‌ చేసిన ట్వీట్టు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

త్రివిక్రమ్‌, బండ్ల గణేష్‌ మధ్య అంతగా ఎటాచ్‌మెంట్‌ లేదని ‘భీమ్లానాయక్‌’ ఆడియో ఫంక్షన్‌కు ముందు బయటపడింది. పవన్‌ కళ్యాణ్‌ అభిమాని ఒకరు ఫోన్‌ చేయగా... తనను త్రివిక్రమ్‌ రానివ్వడం లేదని బండ్ల గణేష్‌ ఆ అభిమానితో చెప్పారు. ఆ ఆడియో లీకై, వైరల్‌ కావడంతో ఇద్దరి మధ్య గ్యాప్‌ ఉందని తెలిసింది. మధ్యలో ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్‌ని కలిశాను..మాట్లాడాను మా మధ్య ఎలాంటి గ్యాప్‌ లేదని బండ్ల ఓ సందర్భంలో చెప్పారు. ఏమైందో తెలీదు.. కానీ మళ్లీ డైరెక్టర్‌పై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు.

ఈ మేరకు శుక్రవారం అభిమానులతో చాట్‌ చేశారు. అందులో ఓ అభిమాని ‘బండ్లన్న నాకు ప్రొడ్యూసర్‌ అవ్వాలని వుంది’ అన్నాడు. ‘గురూజీని కలవండి.. ఒక కాస్ట్లీ గిఫ్ట్‌ ఇవ్వండి అప్పుడు మీ కోరిక నెరవేరుతుంది’ అని బండ్ల గణేష్‌ సమాధానం ఇచ్చారు. దానితోపాటు ‘భార్యభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురు శిష్యుల్ని... ఎవర్నైనా ఆయన వేరు చేస్తాడు’ అని మరో ట్వీట్‌ చేశారు. అయితే కొంతకాలం సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడు ఉన్నట్టుండి త్రివిక్రమ్‌ని ఎందుకు టార్గెట్‌ చేశాడు? వివాదస్పద ట్వీట్లకు కారణం ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-05-27T12:00:45+05:30 IST