Biggboss 7 : నామినేషన్ల పర్వం మామూలుగా లేదు.. దబిడి దిబిడే!
ABN , First Publish Date - 2023-11-14T17:18:38+05:30 IST
బిగ్‌బాస్ హౌస్‌లో 72వ రోజు నామినేషన్స్ ప్రక్రియ హాట్‌హాట్‌గా జరుగుతోంది. మొదటి రోజే బిగ్ బాస్ హౌస్‌ను గత వారంలో మహారాణుల పాత్ర పోషించిన నలుగురు హీటెక్కించేశారు. ఈ వారం నామినేషన్ల పర్వంలో ఎప్పుడు లేనంతగా వాదనలు మొదలయ్యాయి.
బిగ్‌బాస్ హౌస్‌లో (biggboss) 72వ రోజు నామినేషన్స్ ప్రక్రియ హాట్‌హాట్‌గా జరుగుతోంది. మొదటి రోజే బిగ్ బాస్ హౌస్‌ను గత వారంలో మహారాణుల పాత్ర పోషించిన నలుగురు హీటెక్కించేశారు (nominations). ఈ వారం నామినేషన్ల పర్వంలో ఎప్పుడు లేనంతగా వాదనలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ ప్రతి విమర్శలతో హాట్ హాట్‌గా సాగింది.. రతికా, శోభ, ప్రియాంక, అశ్విని ఇలా వీరిలో ఎవరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు రైతుబిడ్డ, అంబటి అర్జున్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో ఉండగా.. నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా జరుగుతోంది. తాజాగా రెండో రోజుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. నామినేషన్ సమయంలో అమర్దీప్, యావర్ మధ్య మాటల యుద్థం జరిగింది. యావర్‌ను నామినేట్ చేస్తూ.. గతం తవ్వుకుంటే ఎవ్వరివీ అంతా పెద్ద జాతకాలు కావు’ అని అమర్ అన్నాడు.
వీరిద్దరి మధ్యలో రతికా (Rathika) రావడంతో అమర్ (Amar) మరింత రెచ్చిపోయాడు. స్ప్రైట్ కోసం నామినేషన్ చేశావంటూ యావర్‌ను అమర్ అనడంతో.. నామినేషన్ కోసం అమర్ చెప్పే పాయింట్ గడచిన రెండు మూడు వారాలదా? అని యావర్‌తో రతిక అంది. దీంతో అమర్, యావర్ మధ్య యుద్ధం మొదలైంది. ఒకరినొకరు మీది మీదికి దూసుకొచ్చారు. రారా..నువ్వు రా.. అంటూ కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో ఇద్దరి మధ్యలో శివాజీ ఎంటరై సర్ధి చెప్పారు. ఆ తర్వాత అమర్ కావాలి.. అమర్ పోవాలి.. అంటూ గట్టిగా వెటకారంగా స్లోగాన్స్ ఇచ్చాడు అమర్. పాత విషయాన్ని గుర్తు చేసి.. నిజంగా వేయాలంటే.. నిన్ను అప్పుడే నామినేషన్స్‌లో వేసేవాడినని అమర్ అన్నారు. ఆ తర్వాత ఎమోషన్ ఇజ్ ది లూజ్ మోషన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్.. ఆ ఫ్లోను మనం కంట్రోల్ చేయలేం అని గౌతమ్ అనగా.. అది కంట్రోల్ చేసుకోవాలిరా.. మంచిదిరా అని కెప్టెన్ శివాజీ అన్నాడు. ్పస్తుతం ఈ ప్రొమో వైరల్ అవుతోంది.