Biggboss 7 : రెండోవారం ఎలిమినేషన్‌.. లీకు వీరులు ఏం చెప్పారంటే..

ABN , First Publish Date - 2023-09-16T16:49:05+05:30 IST

బిగ్‌బాస్‌ (Biggboss7) ఉల్టా పుల్టా సీజన్‌ మాంచి వేడిగా నడుస్తోంది. ఇంటి సభ్యుల్లో కొందరు నిజాయితీగా ఆట ఆడుతుంటే.. కొందరు తగ్గేదేలే అన్నట్లు యాక్ట్‌ చేస్తున్నారు. తోటివారిని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తుండగానే రెండో వారం ఎలిమినేషన్‌ వచ్చేసింది. మొదటివారం నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ అయింది. ఇప్పుడు రెండో వారంలో బిగ్‌బాస్‌ ఎవరిని బయటకు పంపబోతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారంది.

Biggboss 7 : రెండోవారం ఎలిమినేషన్‌.. లీకు వీరులు ఏం చెప్పారంటే..

బిగ్‌బాస్‌ (Biggboss7) ఉల్టా పుల్టా సీజన్‌ మాంచి వేడిగా నడుస్తోంది. ఇంటి సభ్యుల్లో కొందరు నిజాయితీగా ఆట ఆడుతుంటే.. కొందరు తగ్గేదేలే అన్నట్లు యాక్ట్‌ చేస్తున్నారు. తోటివారిని తొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చూస్తుండగానే రెండో వారం ఎలిమినేషన్‌ వచ్చేసింది. మొదటివారం నటి కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేట్‌ అయింది. ఇప్పుడు రెండో వారంలో బిగ్‌బాస్‌ ఎవరిని బయటకు పంపబోతున్నారా? అన్నది ఆసక్తికరంగా మారంది. ప్రస్తుతం శివాజీ, పల్లవి ప్రశాంత్‌, రతిక, తేజ, అమర్‌ దీప్‌, షకీలా(Shakeela) , గౌతమ్‌ కృష్ణ, శోభాశెట్టి, ప్రిన్స్‌ యావర్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. తెలుగుతో పెద్దగా టచ్‌ లేని ప్రిన్స్‌ ఎలిమినేట్‌ కావచ్చని అంతా అనుకున్నారు. కానీ తాజాగా జరిగిన టాస్క్‌లో చెలరేగిపోయాడు. తనలోనూ ఆటగాడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. అతను ఎలిమినేట్‌ అయ్యేలా కనిపించడం లేదు. ఒక నామినేషన్స్‌లో ఉన్న వారిలో షకీలా, తేజకు తక్కువ ఓటింగ్‌ ఉంది. టేస్టీ తేజ అందరితో బాగా ఉంటున్నాడు. ఎంతోకొంత ఆడుతూ కంటెంట్‌ ఇస్తున్నాడు. అయితే షకీలా పెద్దగా ఆడింది లేదని వినిపిస్తోంది. సో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది షకీలానే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఓటింగ్‌, ఒపీనియన్‌ పోల్‌ ప్రకారం షకీలానే ఎలిమినేట్‌ అవుతుందని అంతా భావిస్తున్నారు. దాదాపు 17 వేల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొనగా అత్యధికంగా నటి షకీలా ఎలిమినేట్‌ అవుతుందని 24 శాతం మంది తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఒకటి మాత్రం నిజం... శృంగార తారగా ముద్ర పడ్డ షకీలా.. బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చి తాను కూడా అందరిలాంటే మామూలు మహిళే అని నిరూపించింది. ఆటలో కాస్త స్లోగా ఉన్న.. నిజజీవితంలో తాను ఎలా ఉంటారో అలాగే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నారు. ఎవరితోనూ గొడవలు లేవు..మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. గేమ్‌ మాత్రం నిజాయతీగానే ఆడింది. కంటెంట్‌ ఇచ్చే విషయంలో ఎక్కడా ఓవర్‌ చేయలేదు. శృంగారతారగా ఆమెపై చిన్నచూపు ఉండేది. బిగ్‌ బాస్‌లోకి వెళ్లడం ద్వారా.. ఆమె హుందాతనం కనిపించింది. ఒకడు రైతునని.. ఇంకొకడు డాక్టర్‌ అని.. ఇంకొకడు బీటెక్‌ అని.. ఇంకో ఆమె లవ్‌ బ్రేకప్‌ అని.. ఇలా హౌస్‌లో ఉన్నవారు సింపథీ డ్రామాలాడుతున్నారు కానీ.. వాళ్లందరి కంటే ఎక్కువ కష్టం పడి వచ్చింది ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి షకీలా అని చెప్పవచ్చు. ఏరోజు ఆమె హౌస్‌లో తన కష్టం గురించి చెప్పుకోలేదు. సింపథీ డ్రామా ప్లే చేయలేదు. నిజాయితీగా గేమ్‌ ఆడింది. ఒకవేళ్ల నెటిజన్ల ఊహ నిజమే ఆమె ఎలిమినేట్‌ అయితే.. ఆటలో ఓడిపోవచ్చు కానీ.. ఆడియన్స్‌ మనసుల్ని గెలుచుకుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

Updated Date - 2023-09-16T17:34:05+05:30 IST