Brahmaji: నన్నూ విష్‌ చేయండి.. బ్రహ్మాజీ ఆసక్తికర పోస్ట్‌!

ABN , First Publish Date - 2023-08-26T13:34:22+05:30 IST

సినిమాల్లో తనదైన శైలిలో హాస్యాన్ని పంచుతుంటారు నటుడు బ్రహ్మాజీ(Brahmaji). అంతే కాదు సోషల్‌ మీడియాలోనూ అంతకుమించి హల్‌చల్‌ చేస్తూ వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్‌ నెటజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్‌ ఏంటంటే..

Brahmaji:  నన్నూ విష్‌ చేయండి.. బ్రహ్మాజీ ఆసక్తికర పోస్ట్‌!


సినిమాల్లో తనదైన శైలిలో హాస్యాన్ని పంచుతుంటారు నటుడు బ్రహ్మాజీ(Brahmaji). అంతే కాదు సోషల్‌ మీడియాలోనూ అంతకుమించి హల్‌చల్‌ చేస్తూ వినోదాన్ని పంచుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్‌ నెటజన్లను కడుపుబ్బ నవ్విస్తోంది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్‌ ఏంటంటే.. సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani), ఆయన కుమారుడు కాల భైరవకు(Kala Bhairava) జాతీయ అవార్డు రావడం వల్ల బ్రహ్మాజీని కూడా అభినందించాలట. ట్విట్టర్‌ వేదికగా ఆయన  కోరికను బయటపెట్టారు.

‘మా పక్కింట్లో ఒక ఆస్కార్‌ అవార్డు, రెండు జాతీయ అవార్డులు ఉన్నాయి.. అందుకే నన్ను అభినందించండి’ అంటూ బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘మీ పక్కింట్లో ఉంటున్న అవార్డు విజేతలకు శుభాకాంక్షలు అని ఒకరు కామెంట్‌ చేస్తే ‘ఉత్తమ పక్కింటి వ్యక్తి’ అవార్డును మీకే ఇస్తామంటూ మరొకరు కామెంట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికిగానూ ఉత్తమ నేపథ్య సంగీతానికి కీరవాణికి, ఉత్తమ గాయకుడిగా కాలభైరవకు  జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే! (National awards)

Updated Date - 2023-08-26T13:34:58+05:30 IST