NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!
ABN , First Publish Date - 2023-05-28T11:54:39+05:30 IST
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు శతజయంతిని పురస్కరించుకుని.. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ ఆయనని గుర్తు చేసుకున్నారు. ఎన్.టి.ఆర్ కారణజన్ముడని మెగాస్టార్ చిరంజీవి అంటే.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్.టి.ఆర్. అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం వారి స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎన్.టి.ఆర్ (NTR) కారణజన్ముడని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అంటే.. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్.టి.ఆర్. అని అన్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan). విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు (NT Ramarao) శతజయంతిని పురస్కరించుకుని మెగా బ్రదర్స్ (Mega Brothers) ఆయనని గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ శతజయంతి (NTR 100th Birth Anniversary) శుభాకాంక్షలు తెలిపితే.. జనసేన తరపున పవర్ స్టార్ ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు.
ఎన్.టి.ఆర్ కారణ జన్ముడు: చిరంజీవి
నూటికో కోటికో ఒక్కరు... వందేళ్లు కాదు...చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు NTR. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావుగారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావుగారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ...’’ అని ఎన్టీఆర్‌కు ఎమోజీలతో చిరంజీవి నమస్కారం పెట్టారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్.టి.ఆర్.: పవన్ కల్యాణ్
‘‘చరిత మరువని నటనా కౌశలం. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం.. ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భాన అంజలి ఘటిస్తున్నాను. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది.. ఎందరికో అనుసరణీయమైంది. ఢిల్లీ రాజకీయాలలో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగువారి ‘ఆత్మ గౌరవం’ అనే నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి అజేయమైన విజయం అందుకుని తెలుగువారి సత్తా ఢిల్లీ దాకా చాటారు. అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ఎన్.టి. రామారావు తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణం. ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నాను’’ అని జనసేన తరపున ఓ మెసేజ్‌ను విడుదల చేశారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!
*Miss Shetty Mr Polishetty: నవీన్ పాడుతుంటే.. హీరో ధనుష్ వాయిస్ వినిపిస్తోంది.. ఏంటి కథ?
*Sivaji Raja: ‘రాజు’లు చాలా మంది ఉంటారు కానీ.. అందులో మంచివారు కొందరే!
*Vijayashanthi: ఎన్టీఆర్‌తో ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది
*Super Star Krishna: సినిమా వచ్చి 52 ఏళ్లు.. అయినా ఆ కటౌట్స్ చూస్తే..!
*Daana Veera Soora Karna: ఒక్క ఎన్టీఆర్‌కే ఇది సాధ్యం..!