Venkatesh : ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనుంది.. నాగానాయుడు మళ్లీ వస్తాడు
ABN , First Publish Date - 2023-10-16T16:53:37+05:30 IST
"నేను నటిస్తున్న 75 వ చిత్రమిది. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమాభిమానాల వల్లే ఇక్కడి వరకూ వచ్చా. తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ నుంచి ఇప్పటి వరకూ పరిశ్రమతోపాటు ప్రేక్షకులంతా ప్రోత్సహించారు. ఇప్పటిదాకా ఎలాంటి డల్ మూమెంట్ లేదు. కెరీర్ సాఫీగా సాగింది’’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు.
"నేను నటిస్తున్న 75వ (venkatesh 75) చిత్రమిది. ప్రేక్షకులు, అభిమానుల ప్రేమాభిమానాల వల్లే ఇక్కడి వరకూ వచ్చా. తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ నుంచి ఇప్పటి వరకూ పరిశ్రమతోపాటు ప్రేక్షకులంతా ప్రోత్సహించారు. ఇప్పటిదాకా ఎలాంటి డల్ మూమెంట్ లేదు. కెరీర్ సాఫీగా సాగింది’’ అని విక్టరీ వెంకటేష్ అన్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం 'సైంధవ్’(Saindhav). సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెంకటేశ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ చిత్రం అంగీకరించడానికి ముందు ఎన్నో కథలు విన్నాను. అవన్నీ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్సే. అలాంటి సమయంలో శైలేశ్ ‘సైంధవ్’ కథతో నా వద్దకు వచ్చారు. అద్భుతమైన కథ ఇది. ఇందులో భావోద్వేగాలు బలంగా ఉంటాయి. కూతురు సెంటిమెంట్‌ని కొత్తగా చూపించారు. వైల్డ్, క్రేజీగా ఉంటుంది. ఇందులో ఉన్న ఎమోషన్స్‌ను ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంది. న్యూ స్టైల్ యాక్షన్‌కు ఇందులో స్కోప్ ఉంది. కొత్త వెంకటేశని చూస్తారు. నటన పరంగా నాకు మరింత స్కోప్ లభించింది. ఇందులో హీరో పేరు సైంధవ్ కోనేరు. దాన్ని షార్ట్‌కర్ట్ చేసి సైకో అని పెట్టారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తే సీక్వెల్ ఉండొచ్చు. తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్‌తో ఎన్ని చిత్రాలు వచ్చినా దేనికదే ప్రత్యేకం. ఈ చిత్రంతో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో.. అది ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమలో చూడని అంశం.
మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ చేస్తా...
"ఇప్పుడు ట్రెండ్ మారింది. రజనీ, కమల్ లాంటివారు కూడా ట్రెండ్ మార్చి సినిమాలు చేస్తున్నారు’ అనే టాపిక్ నా దగ్గరకు వచ్చింది. ఏ నటుడికైనా మంచి కథ కుదరాలి. సీనియర్ హీరో, జూనియర్ హీరో అని కాదు. మంచి కథను ఎంపిక చేసుకుని అన్ని ఎలిమెంట్స్ సినిమా చేేస్త తప్పకుండా ప్రేక్షకులకు చేరువవుతారు. ఇకపై ఎక్కువగా మెచూర్డ్ పాత్రల్లో నటిస్తా. అందులో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే ఈ చిత్రం చేశా. త్వరలో మెచూర్డ్ లవ్‌స్టోరీ ఒకటి చేయాలనుకుంటున్నా. ఇప్పటికే రైటర్స్‌కి చెప్పా. రాబోతున్న సంక్రాంతికి నాతో పాటు మా చిన్నోడు నటించిన ుగుంటూరు కారం’ చిత్రం కూడా విడుదల కావడం ఆనందంగా ఉంది.
నాగా నాయుడు వస్తాడు..
అమెజాన్, నెట్‌ప్లిక్స్ నా కోసం కొత్త కథలు తయారు చేస్తున్నాయి. ‘రానా నాయుడు 2’ కూడా ఉంటుంది. నాగా నాయుడు మళ్లీ వస్తాడు. ురానా నాయుడు’ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి రీచ అయింది. అంతే విమర్శలు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నన్ను నాగా నాయుడు అనే పిలుస్తున్నారు. నేను ఎంతో ఆశ్చర్యపోయా. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌కు వెళ్లినప్పుడు కూడా అదే జరిగింది. ‘రానా నాయుడు’ హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో ఆ కంటెంట్‌ను చాలా వరకూ తగ్గించాం. రాబోయే సిరీస్‌తో ఇంకా తగ్గిస్తాం. నేను నటించిన చిత్రాల్లో 'బొబ్బిలిరాజా' సీక్వెల్ చేయాలనుకుంటున్నా.