Tiger Nageswararao: మెసేజ్‌లు చూస్తే ఆకలేస్తుందని అర్థమైంది.. కాస్త ఓపిక పట్టండి!

ABN , First Publish Date - 2023-07-25T14:59:42+05:30 IST

‘వాల్తేరు వీరయ్య’, ‘ధమాకా’ చిత్రాలతో రెండు సాలిడ్‌ హిట్స్‌ ఇచ్చారు రవితేజ (Raviteja) ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’తో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Tiger Nageswararao: మెసేజ్‌లు చూస్తే ఆకలేస్తుందని అర్థమైంది.. కాస్త ఓపిక పట్టండి!

‘వాల్తేరు వీరయ్య’, ‘ధమాకా’ చిత్రాలతో రెండు సాలిడ్‌ హిట్స్‌ ఇచ్చారు రవితేజ (Raviteja) ప్రస్తుతం ‘టైగర్‌ నాగేశ్వరరావు’(Tiger Nageswararao)తో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కూడా వినూత్న రీతిలో ప్రమోషన్‌ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 20న ఈ సినిమాని రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ‘టైగర్‌ నాగేశ్వరరావు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్‌ హీరోలు విడుదల చేయడం కాకుండా గ్లింప్స్‌కు వాయిస్‌ కూడా ఇవ్వడం అదనపు ఆకర్షణ అయింది.

‘‘జింకలను వేటాడిన పులిని చూసి ఉంటావ్‌. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా..?" అని రవితేజ పవర్‌ఫుల్‌ వాయిస్‌ తో చెప్పే డైలాగ్‌ గ్లింప్స్‌ అదిరిపోయేలా ఉంది. సినిమాపై మరింత అంచనాలు పెంచేలా దర్శకుడు తాజాగా ఓ ట్వీట్‌ చేశాడు. ‘హల్లో తమ్ముళ్లు.. మీ మెసేజ్‌లు చూసి మళ్లీ మీకు ఆకలేస్తుందని అర్థమైంది. ఈ సారి మనం పెంచిన పులి వేటాడటానికి సిద్ధమైంది. త్వరలోనే టీజర్‌ డేట్‌ ప్రకటిస్తాం. కొంచెం ఓపిక పట్టండి’’ అని పేర్కొన్నాడు. దీంతో టీజర్‌ కోసం ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్న అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

Updated Date - 2023-07-25T14:59:42+05:30 IST