KrishnaVamsi:'గులాబీ' సినిమా హీరోగా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా ?
ABN , First Publish Date - 2023-07-16T14:33:58+05:30 IST
'గులాబీ' దర్శకుడు కృష్ణవంశీ మొదటి సినిమా. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత, కాగా జెడి చక్రవర్తి, మహేశ్వరీ లీడ్ పెయిర్ గా చేశారు. ఇందులో బ్రహ్మాజీ ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా జెడి చక్రవర్తి కన్నా ముందు ఇంకొక నటుడికి కూడా వినిపించారు, అతనెవరు, ఎందుకు వద్దనుకున్నారు అంటే...
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (KrishnaVamsi) తన మొదటి సినిమా 'గులాబీ' #Gulabi తోటే అందరి ప్రసంశలు అందుకోవటమే కాకుండా, ఈరోజు అతను తనదైన ముద్రని వేసుకున్నాడు చిత్ర పరిశ్రమలో. అయితే ఈ 'గులాబీ' #Gulabi సినిమాతో జెడి చక్రవర్తి (JDChakravarthy) హీరోగా పరిచయం అయ్యాడు, అలాగే బ్రహ్మాజీ (Brahmaji) కూడా ఈ సినిమాతో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇలా చాలామందికి ఈ సినిమా ఘాన విజయాన్ని ఇచ్చింది. ఇందులో కథానాయకురాలిగా శ్రీదేవి (Sridevi) చెల్లెలు మహేశ్వరి (Maheswari) చేసింది. ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) నిర్మించారు. ఇదంతా ఒక చరిత్ర అనే చెప్పుకోవాలి.
కానీ, ఈ 'గులాబీ' #Gulabi సినిమాకి ముందు జెడి చక్రవర్తి ని హీరోగా అనుకోలేదుట. ఈ విషయాన్ని స్వయంగా జెడి నే చెప్పాడు. ఈరోజు 'దయా' #Dayaa వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల ఫంక్షన్ కి జెడి ని హీరోగా చేసిన కృష్ణ వంశి, జెడి స్నేహితుడు ఉత్తేజ్ (Uttej) ఇద్దరూ ప్రత్యేక అతిధులుగా వచ్చారు. అదే విషయాలను జెడి చెపుతూ, తాను సినిమాల్లోకి రావటానికి ఉత్తేజ్ కారణం అని చెప్పాడు. "ఉత్తేజ్ నన్ను తీసుకెళ్లి రామూగారికి (RGV) పరిచయం చేసాడు, ఆలా నా సినిమా ప్రస్థానం మొదలైంది," అని చెప్పాడు జెడి చక్రవర్తి.
అలాగే 'గులాబీ' సినిమా గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పాడు. కృష్ణవంశీ 'గులాబీ' సినిమా కథని చాలామందికి చెప్పినట్టున్నారు, స్టార్ట్ అయింది, ఆగిపోయింది ఆలా చాలా జరిగింది అని చెప్పాడు జెడి. "అయితే ముందు ఈ కథని డాక్టర్ రాజశేఖర్ (Dr Rajasekhar) దగ్గరకి వెళ్లి వినిపించు అని నేనే కృష్ణవంశి ని రాజశేఖర్ (Rajasekhar) గారి దగ్గరికి తీసుకెళ్ళాను. వేరే కథ చెప్పాడు కృష్ణవంశి, నేను వెంటనే జోక్యం చేసుకొని, 'గులాబీ' కథ చెప్పు అన్నాను, ఎందుకంటే నాకు కృష్ణవంశి ని దర్శకుడిగా చూడాలని వుంది కాబట్టి. వంశీ అప్పుడు 'గులాబీ' కథ చెప్పాడు, కథ విన్న వెంటనే రాజశేఖర్ తాను నా వేషం వేస్తాను అన్నారు, నన్ను ఏమో బ్రహ్మాజీ వేషం వెయ్యమన్నారు. వెంటనే కృష్ణవంశీ బయటకి వచ్చేసి, నేను ఈ కథని ఒక్క జెడి చక్రవర్తి తో మాత్రమే చేస్తాను," అని చెప్పాడు.
అది కృష్ణ వంశీ కున్న నిబద్ధత అని చెప్పాడు జెడి. ఆరోజు 'గులాబీ' లో నన్ను కృష్ణవంశీ తీసుకోబట్టే నేను ఈరోజు ఈ స్టేజి లో ఉండటానికి కారణం. అందుకనే నేను ఓటిటి లోకి ఈ 'దయా' #DayaaWebSeries వెబ్ సిరీస్ తో అడుగుతూ పెడుతున్నప్పుడు అతను ఉండాలని అతన్ని ఈ ఫంక్షన్ కి పిలిచాను, లేదు డిమాండ్ చేశా రమ్మని. దానికి తోడు ఈ వెబ్ సిరీస్ దర్శకుడు పవన్ సాధినేని (PavanSadhineni), కృష్ణ వంశీ కి పెద్ద అభిమాని. అతని స్పూర్తితో సినిమాల్లోకి వచ్చాడు. అందుకని ఈ ఫంక్షన్ స్పెషల్ అని చెప్పాడు జెడి.