Film Chamber Elections: రికార్డ్ స్థాయిలో పోలింగ్!
ABN , First Publish Date - 2023-07-30T16:20:41+05:30 IST
ఆదివారం ఉదయం రసవత్తరంగా మొదలైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ముగిశాయి. అసలు కథ మొదలైంది. 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఆరు గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు. సి.కల్యాణ్ ప్యానల్, దిల్ రాజు ప్యానల్ మధ్య పోటీ నెలకొంది.
ఆదివారం ఉదయం రసవత్తరంగా మొదలైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికలు ముగిశాయి. అసలు కథ మొదలైంది. 4 గంటలకు ఓట్ల (Film Chamber elections) లెక్కింపు మొదలుపెట్టారు. ఆరు గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు. సి.కల్యాణ్ ప్యానల్, దిల్ రాజు ప్యానల్ మధ్య పోటీ నెలకొంది. మొత్తం 1339 ఓట్లు నమోదయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో 1600 ఓట్లకు గాను 891. స్టూడియో సెక్టార్‌లో 98 ఓట్లకు గాను 68, డిస్ర్టిబ్యూషన్ సెక్టార్ లో 597 గాను 380 ఓట్లు పోల్ అయ్యాయి. గతంలో లేని విధంగా ఈసారి రికార్డు స్థ్థాయిలో ఓట్లు పోల్ అయినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు.
4 గంటల నుంచి కౌంటింగ్ మొదలు
మొదట స్టూడియో సెక్టార్ ఓట్లు లెక్కింపు
తరువాత డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్
ఫైనల్ గా ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు.