Bichagadu2: విజయ్ ఆంటోనీ ఈ కలెక్షన్స్ ఊహించి ఉండడు

ABN , First Publish Date - 2023-05-20T16:01:36+05:30 IST

మొత్తానికి విజయ్ ఆంటోనీ కి విజయం లభించింది. ఎన్నాళ్ళ నుండో ఊరిస్తున్న విజయం 'బిచ్చగాడు 2' ద్వారా లభించింది. మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ఎంత కలెక్టు చేసింది అంటే...

Bichagadu2: విజయ్ ఆంటోనీ ఈ కలెక్షన్స్ ఊహించి ఉండడు

విజయ్ ఆంటోనీ (VijayAntony) చాలా కాలం నుంచి ఒక హిట్ కోసం పరితపిస్తున్నాడు. మధ్యలో ఏవేవో సినిమాలు చేసాడు కానీ, అవేవి అతనికి ఒక బ్రేక్, విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అప్పుడెప్పుడో వచ్చిన 'బిచ్చగాడు' #Bichagadu సినిమానే అతని కెరీర్ లో బెస్ట్ హిట్. కానీ మళ్ళీ అదే బిచ్చగాడు పేరుతో వచ్చిన 'బిచ్చగాడు 2' #Bichagadu2 నిన్న విడుదల అయింది. అదేంటో పాపం అతనికి బిచ్చగాడుకి ఎదో లింక్ వున్నట్టుగా మళ్ళీ ఈ 'బిచ్చగాడు 2' #Bichagadu2 గొప్ప విజయాన్ని అతనికి ఇచ్చింది.

ఈ సినిమాకి విజయ్ ఆంటోనీ నిర్మాతే కాకుండా, దర్శకత్వం కూడా చేసాడు. మొదటి 'బిచ్చగాడు' కి ఈ 'బిచ్చగాడు 2' కి ఎటువంటి సంబంధం లేదు. అందులో తల్లి కోసం ధనవంతుడిగా వున్న విజయ్ బిచ్చగాడిగా మారతాడు. ఇందులో బిచ్చగాడుగా వున్న విజయ్, ధనవంతుడిగా అవతారం ఎత్తుతాడు. అంతే తేడా. ఇందులో కావ్య తాపర్ (KavyaThapar) కథానాయిక.

bichagadu2still.jpg

అప్పుడెప్పుడో తమిళంలో వచ్చిన 'పిచ్చైకారన్' #Pichaikkaran అనే సినిమాని 'బిచ్చగాడు' గా తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. అందులో పాటలు, కాన్సెప్ట్ బాగుండబట్టే ఆ సినిమా తమిళం తో పాటు, తెలుగులో కూడా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు 'బిచ్చగాడు 2' #Bichagadu2 కూడా మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

Bichagadu-Image-3.jpg

ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే అది విజయ్ ఆంటోనీ కూడా ఊహించి ఉండదు, అంతలా కలెక్టు చేసింది. మొదటి రోజు సుమారు రూ 4.5 కోట్లు గ్రాస్ తెలుగు రాష్ట్రాల్లో కలెక్టు చేసింది అంటే, అది చాలా పెద్ద విజయం అనే చెప్పాలి. మణిరత్నం దర్శకత్వం లో వచ్చిన 'పీస్ 2' కన్నా ఈ సినిమా ఎక్కువ కలెక్షన్ చేసింది అంటే ఆశ్చర్యమే కదా.

ఇంకా ఏరియా బట్టి చూస్తే నైజాం రూ. 72 లక్షలు, సీడెడ్ 35 లక్షలు, ఉత్తరాంధ్ర 32 లక్షలు, ఈస్ట్, వెస్ట్ కలిపి రూ. 34 లక్షలు, గుంటూరు రూ. 22 లక్షలు, కృష్ణా జిల్లా రూ. 18 లక్షలు రాబట్టగా, నెల్లూరు రూ. 10 లక్షలు మాత్రమే రాబట్టింది. ఇలా చూసుకున్న ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మొత్తం 2.23 కోట్లు షేర్ వసూల్ చేసింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 6 కోట్లకి థియేట్రికల్ హక్కులు అమ్ముడవగా, మొదటి రోజు ఏకంగా రూ. 2.23 కోట్ల షేర్ ను రాబట్టింది అంటే ఈ శని ఆదివారాల్లో ఇది బ్రేక్ ఈవెన్ అయిపోయి ఇక లాభాల పంట పండుతుంది.

Updated Date - 2023-05-20T16:01:36+05:30 IST