VenkateshDaggubati: మొదటిసారి 'రానానాయుడు' నెగటివ్ కామెంట్స్ మీద స్పందించిన వెంకీ, ఏమన్నారు అంటే...

ABN , First Publish Date - 2023-05-31T12:30:13+05:30 IST

'రానా నాయుడు' వెబ్ సిరీస్ విడుదల అయిన తరువాత అందులో నటించిన విక్టరీ వెంకటేష్ మీద ఎన్నో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. అయితే మొదటిసారిగా వాటి గురించి వెంకటేష్ ఏమన్నారు, అలాగే రెండో సీజన్ ఎలా వుండబోతోంది అని చెప్పారు.

VenkateshDaggubati: మొదటిసారి 'రానానాయుడు' నెగటివ్ కామెంట్స్ మీద స్పందించిన వెంకీ, ఏమన్నారు అంటే...
Venkatesh Daggubati

దగ్గుబాటి వెంకటేష్ (DaggubatiVenkatesh), సురేష్ బాబు (SureshBabu) కుమారుడు రానా దగ్గుబాటి (RanaDaggubati) నటించిన 'రానా నాయుడు' #RanaNaidu నెట్ ఫ్లిక్స్ (Netflix) లో విడుదలై మంచి విజయం సాధించింది. అలాగే ఈ వెబ్ సిరీస్ మీద కొంతమంది తెలుగు ప్రేక్షకులు నెగటివ్ కామెంట్స్ కూడా చేశారు. ఎందుకంటే వెంకటేష్ కి ఎంతోమంది మహిళా అభిమానులు వున్నారు, అలాగే అతని సినిమాలన్నీ చాలా క్లీన్ గా కుటుంబం అంతా చూసేటట్టు ఉంటాయి. కానీ ఈ 'రానా నాయుడు' #RanaNaidu వెబ్ సిరీస్ లో కొంచెం శృతి మించి అన్నీ ఉన్నాయని అని అందులోకి వెంకటేష్ ని కొంచెం నెగటివ్ రోల్ లో చూసేటప్పటికి నెగటివ్ కామెంట్స్ బాగా వచ్చాయి.

venkatesh-rananaidu1.jpg

అయితే వీటి గురించి వెంకటేష్ మొదటిసారిగా స్పందించారు. తన అన్న, నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరాం #DaggubatiAbhiram కథానాయకుడిగా తేజ (Director Teja) దర్శకుడిగా వస్తున్న 'అహింస' (Ahimsa) సినిమా ప్రచార వేడుకలకు వెంకటేష్ అతిధిగా వచ్చారు. ఆ సమయంలో 'రానా నాయుడు' వెబ్ సిరీస్ గురించి అడిగినప్పుడు అతను చెప్పను అంటూనే స్పందించారు. "నెట్ ఫ్లిక్స్ చాలా సంతోషంగా వుంది. నాకు కూడా చాలా ఫీడ్ బ్యాక్ వచ్చింది. అది అయిపొయింది, ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా ముందుకు పోవాలి," అని చెప్పారు వెంకటేష్.

rananaidu1.jpg

ఒరిజినల్ కంటెంట్ అలా ఉండటం వలన ఈ 'రానా నాయుడు' ఆలా ఉందని, అందరినీ ప్లీజ్ చెయ్యాలంటే కష్టం అయిన పని అన్నారు వెంకటేష్. అలాగే మొదటి సీజన్ లో కొన్ని సన్నివేశాలను కొంతమందికి నచ్చలేదని, ఎందుకంటే ఆ సిరీస్ స్టైల్ ఆలా ఉందని, అది ప్రభావం చూపించిందని ఒప్పుకున్నారు వెంకటేష్. అయితే సీజన్ రెండు లో అందరికీ నచ్చే విధంగా తీస్తామని, ఆలా అని అందరికీ నచ్చకపోవచ్చు అని కూడా చెప్పారు.

Updated Date - 2023-05-31T15:45:51+05:30 IST