Brahmanandam: ఉగాది రోజున బ్రహ్మానందానికి ఘన సన్మానం.. ఎందుకంటే?
ABN , First Publish Date - 2023-03-17T18:05:36+05:30 IST
తెలుగు నూతన సంవత్సరాది రోజున హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి (Brahmanandam) ఘనంగా సన్మానం (Felicitation) జరగబోతోంది. ఈ సన్మానానికి సంబంధించిన వివరాలను
తెలుగు నూతన సంవత్సరాది రోజున హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి (Brahmanandam) ఘనంగా సన్మానం (Felicitation) జరగబోతోంది. ఈ సన్మానానికి సంబంధించిన వివరాలను తాజాగా సన్మాన కర్తలు తెలియజేశారు. ఎఫ్.ఎన్.సి.సి (ఫిలింనగర్ కల్చరల్ సెంటర్) ఆధ్వర్యంలో ఉగాది రోజున ప్రముఖ నటుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ (Guinness Book of Records) లోకి ఎక్కిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందాన్ని సత్కరించనున్నామని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC) కమిటీ పెద్దలు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
ఉగాది (Ugadi) రోజు అంటే.. ఈనెల 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు బ్రహ్మానందం ఘనంగా సత్కరించబోతున్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడా రంగాల వారు మాత్రమే కాకుండా అన్ని రంగాల ప్రముఖులు పాల్గొనబోతున్నారని వెల్లడించారు. కాగా ఈ సత్కారాన్ని స్వీకరించాలని కోరేందుకు బ్రహ్మానందం ఇంటికి శుక్రవారం ఉదయం ఎఫ్.ఎన్.సి.సి సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్, కమిటీ మెంబర్ పెద్దిరాజు, గోపాలరావు, ఎఫ్.ఎన్.సి.సి కల్చర్ కమిటీ వైస్ చైర్మన్ సురేష్ కొండేటి కలిసి వెళ్లారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ కమిటీ పెద్దల కోరికను మన్నించి.. ఈ సత్కారాన్ని స్వీకరిస్తానని బ్రహ్మానందం మాటిచ్చినట్లుగా తెలుస్తోంది. (Felicitation to Brahmanandam)
బ్రహ్మానందం విషయానికి వస్తే.. ఏ సత్కారానికైనా, ఏ అవార్డుకైనా ఆయన అర్హుడు. ఎందుకంటే.. ఆయన ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఆయన నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. ఆయన లేకుండా నెటిజన్లకు రోజు గడవదు. ఎలాంటి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ కావాలన్నా బ్రహ్మీనే కనిపిస్తారు. ఒక్కోసారి నెటిజన్లే.. అసలు బ్రహ్మానందం అనే వ్యక్తి లేకపోతే.. పరిస్థితి ఏంటనేలా చర్చలు కూడా జరుపుతుంటారు. అలాంటి బ్రహ్మీని సత్కరించుకోవడమంటే.. తెలుగు సినిమా కామెడీని గౌరవించినట్లే (Brahmanandam Comedy).
ఇవి కూడా చదవండి:
*********************************
*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?
*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?
*Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!
*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది
*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..
*VBVK: ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
*RGV: స్వర్గంలో వాళ్లుంటారనే అపోహ వద్దు.. ఆ పని ఇప్పుడే చేయండి
*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?