Hari Teja : ఫిదాలో అక్క పాత్ర చేజారిందిలా
ABN , First Publish Date - 2023-10-03T14:45:18+05:30 IST
హరితేజ (Hariteja).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి. బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా సందడి చేస్తోంది. మరోవైపు యాంకర్‌గానూ అలరిస్తోంది. తనకిచ్చిన పాత్ర కామెడీ, ఎమోషన్, సీరియస్ ఏదైనా సరే అందులో ఒదిగిపోతుంది.
హరితేజ (Hariteja).. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి. బుల్లితెరతోపాటు వెండితెరపై కూడా సందడి చేస్తోంది. మరోవైపు యాంకర్‌గానూ అలరిస్తోంది. తనకిచ్చిన పాత్ర కామెడీ, ఎమోషన్, సీరియస్ ఏదైనా సరే అందులో ఒదిగిపోతుంది. తాజాగా హరితేజ సుధీర్‌బాబు హీరోగా హర్షవర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు శేఖర్ కమ్ముల 9Sekhar kammula) అతిథిగా హాజరయ్యారు. ఆయన్ను చూసిన హరితేజ ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 'ఫిదా’ చిత్రంలో సాయి పల్లవికి అక్కగా నటించాల్సిందని, కానీ ఆ అవకాశం చేజారిందని తెలిపింది.
ఈ సందర్భంగా హరితేజ మాట్లాడుతూ ‘‘శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది. నేను మీ సినిమాలకు పెద్ద అభిమానిని. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్‌కి పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను రిజెక్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలంగాణ యాస రాదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్. మరీ అంత ప్యూర్ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది.
తాజాగా హరితేజ ఆసే్త్రలియాలో విహరిస్తుంది. అక్కడ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తరువాత అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ అభిమాని వింత ప్రశ్న అడిగాడు. మీ భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా? అని అడిగాడు. దానికి హరితేజ షాక్ అయింది. అయితే దీనికి కోపం తెచ్చుకోకుండా సహనంతో సమాధానం చెప్పింది. నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేలా ఉన్నారే’ అని కామెంట్ పెట్టింది. తన భర్త దీపక్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.