Ram Charan: మొదట్లో ఆవేశం, కోపం, ఇప్పుడు ఎంతో మెచూరిటీ ! రేర్ ఫోటోస్ ఆఫ్ రామ్ చరణ్ !
ABN , First Publish Date - 2023-03-27T15:53:18+05:30 IST
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అతను కెరీర్ గురించి, అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు...
చాలామంది స్టార్ కొడుకుల్లానే చిరంజీవి (Mega Star Chiranjeevi) తనయుడు రామ్ చరణ్ (Ram Charan) కూడా సినిమాలలో ఆరంగేట్రం చేసాడు. మొదటి సినిమా 'చిరుత' (Chirutha), పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకుడు, అశ్విని దత్ (Ashwini Dutt) నిర్మాత. ఈ సినిమా 2007 లో విడుదల అయింది. మొదట్లో చిరంజీవి తండ్రిగా ఎంత చెయ్యాలో అంతా రామ్ చరణ్ కి చేసాడు.
ఎందుకంటే చిరంజీవి 'చిరుత' విడుదలని కావాలనే చాలా భారీగా ప్లాన్ చెయ్యలేదు. ఎందుకంటే మొదటి సినిమాకే అంత హైప్ వచ్చేస్తే, రెండో సినిమా నుండి ఒత్తిడి ఎక్కువ అవుతుందని అతనికి తెలుసు. 'చిరుత' చరణ్ కి మంచి పేరు సంపాదించి పెట్టింది.
ఇక రెండో సినిమా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) తో 'మగధీర' (Magadheera) ని చేసాడు. ఈ సినిమా ఒక రికార్డు సృష్టించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ అయింది కూడా. ఇలా ఒక నటుడి రెండో సినిమా ఇండస్ట్రీ హిట్ అవటం బహుశా చరణ్ ఒక్కడికే అయింది. మగధీర తరువాత విడుదల అయిన 'ఆరంజ్' (Orange) మళ్ళీ సరిగ్గా ఆడలేదు. కానీ 'మగధీర' సినిమా తరువాత రామ్ చరణ్ నటుడిగా బాగా పరిపక్వత చెందాడు.
అలాగే రామ్ చరణ్ కెరీర్ మొదట్లోనే హిందీలో కూడా అరంగేట్రం 'తూఫాన్' తో చేసాడు. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఇందులో కథానాయిక, కానీ ఈ సినిమా కంప్లీట్ ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ హిందీ జోలికి పోలేదు. కానీ ఇప్పుడు చేసేవన్నీ పాన్ ఇండియా సినిమాలే. అంటే హిందీ లో మళ్ళీ వేరే చేయనవసరం లేదు, (Globalstar) అతను చేసే సినిమాలే హిందీ నటుల సినిమాల రేంజ్ లో ఆడుతున్నాయి.
మధ్యలో ఒకటి రెండు ప్లాప్స్ వచ్చినా కూడా 'ధ్రువ' (Dhruva) సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. తరువాత వచ్చిన 'రంగస్థలం' (Rangasthalam) మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అవటమే కాకుండా, రామ్ చరణ్ కెరీర్ ని చాలా హై కి తీసుకెళ్లింది. నటనాపరంగా అత్యుత్తమ నటన, అలాగే సినిమా కూడా రామ్ చరణ్ కెరీర్ లో ఒక బెస్ట్ మూవీ గా వుంది. దీని తరువాత వచ్చిన రెండు సినిమాలు మళ్ళీ ప్లాప్ అయినా, 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాతో విజయాన్ని అందుకోవటమే కాకుండా, గ్లోబల్ స్టార్ (GlobalStar) కూడా అయ్యాడు.
ఇప్పుడు అందరి కళ్ళూ ఇతని రాబోయే సినిమా 'గేమ్ చేంజర్' (#GameChanger) మీదే వుంది. శంకర్ దీనికి దర్శకుడు, #RC15 దిల్ రాజు నిర్మాత. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా లో కియారా అద్వానీ (Kiara Advani) ఇందులో కథానాయకురాలు.
2012 లో ఉపాసన కామినేని (Upasana Kamineni) ని వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. వివాహం అయినా కొన్ని సంవత్సరాలకి ఎప్పుడు తల్లిదండ్రులు అవుతారు అని సరదాగా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను ఇంకా చిన్నపిల్లాడిని, నాకు ఎప్పుడు మెచూరిటీ వస్తే అప్పుడు అనేవాడు చరణ్. అయితే అతను అన్నట్టుగానే ఇప్పుడు అంటే పెళ్లయిన పదకొండేళ్లకు రామ్ చరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారు.
మొదట్లో రామ్ చరణ్ కొంచెం కోపంగా, ఆవేశంగా ఉండేవాడు. సినిమా ఫంక్షన్ లో కానీ, బయట కానీ కొంచెం కోపం పడేవాడు. అతన్ని కానీ, చిరంజీవి ని కానీ, బాబాయి పవన్ కళ్యాణ్ గురించి ఎవరయినా ఏమైనా అంటే మాత్రం ఊరుకునే వాడు.
రామ్ చరణ్ ఎప్పుడూ చిన్నపిల్లాడి మనస్తత్వం. కోపం వస్తుంది, కానీ వెంటనే పోతుంది. మొదట్లో అలానే ఉండేది. రాను రాను, రామ్ చరణ్ లో చాలా పరిపక్వత వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా రామ్ చరణ్ ఎక్కడా ఒక పరుషమయిన వాక్యం అనటం కానీ, మాట్లాడటం కానీ చూడలేదు. #HBDRamCharan అందరినీ అంటే చిన్న,పెద్ద తారతమ్యం లేకుండా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ, చాలా పాజిటివ్ గా ఉంటాడు. సహనం చాలా ఎక్కువయింది. ఎంతోమందికి సహాయం కూడా చేస్తున్నాడు. ఎన్నో సార్లు తనతో సినిమాకి పని చేసిన యూనిట్ సభ్యులందరికీ బహుమతులు అందచేసిన సందర్భాలు చాలా వున్నాయి. తన అభిమానులు కష్టం లో వున్నారని తెలిస్తే చాలు వెళ్లి ఆదుకునే సందర్భాలు కూడా వున్నాయి.
రామ్ చరణ్ కి జంతువులంటే చాలా ఇష్టం. ఎన్నో గుర్రాలను తెచ్చుకున్నాడు, పెంచుతూ ఉంటాడు. అలాగే పెట్ డాగ్స్ అన్న కూడా ఇష్టం పెంచుతూ ఉంటాడు. అలాగే గుర్రాల మీద పరిగెత్తుతూ ఆడే పోలో గేమ్ అంటే రామ్ చరణ్ కి ఇష్టం. సికిందరాబాదు మిలిటరీ గ్రౌండ్స్ లో అప్పట్లో ఈ పోలో గేమ్ ఎక్కువగా ఆడేవారు. అందులో రామ్ చరణ్ టీం కూడా ఉండేది. రామ్ చరణ్ మిస్ అవకుండా ఆ గేమ్స్ చూడటానికి వెళ్ళేవాడు. అలాగే క్రికెట్ అన్న బాగా ఇష్టం, చాలామంది క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) లాంటి ఆటగాళ్లు రామ్ చరణ్ కి మంచి స్నేహితులు. హిందీ పరిశ్రమలో చాలామంది నటులు సల్మాన్ ఖాన్ (Salman Khan) లాంటి వాళ్ళు రామ్ చరణ్ కి స్నేహితులు.
అలాగే భక్తి కూడా వుంది. ఎక్కువగా మాలలో ఉంటూ చెప్పులు కూడా లేకుండా తిరుగుతూ చూసాము. అలాగే హైదరాబాద్ లో కాకుండా బయట ప్రదేశాలకి ఎక్కడికి వెళ్లిన శ్రీరాముడు విగ్రహాలని తనతో పాటు తీసుకెళుతూ ఒక చిన్న దేవాలయాలన్ని తాయారు చేసుకుంటూ ఉండటం కూడా చూసాము. 16 ఏళ్ళు అయింది అతని కెరీర్ మొదలు పెట్టి, మొదట్లో అంటే కెరీర్ సగం అనుకుంటే, అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా కనపడుతోంది రామ్ చరణ్ లో. #HBDRamCharan ఎంత పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించినా, రామ్ చరణ్ మాత్రం ఒక సామాన్య మనిషిలా వుండే ఒక నిగర్వి. అందుకే అతను ఇప్ప్పుడు తండ్రికి మించిన తనయుడు అయ్యాడు, అందరూ అదే కొనియాడుతున్నారు. కొడుకు విజయాలను చూస్తూ పొంగిపోతున్న చిరంజీవికి, అంతకన్నా మించిన ఆనందం ఏముంటుంది. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ !