Ileana DCruz: నాలో ఒక ప్రాణి జీవం పోసుకోవడం గొప్ప అనుభూతి!

ABN , First Publish Date - 2023-06-25T17:23:52+05:30 IST

గోవా బ్యూటీ ఇలియానా (Ileana DCruz) త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి విదేశాల్లో ఉంటుందామె. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గర్భవతి కావడం బిడ్డకు జన్మనివ్వబోతుండడం గొప్ప వరంగా భావిస్తున్నాను.

Ileana DCruz: నాలో ఒక ప్రాణి జీవం పోసుకోవడం గొప్ప అనుభూతి!

గోవా బ్యూటీ ఇలియానా (Ileana DCruz) త్వరలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి విదేశాల్లో ఉంటుందామె. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో ముచ్చటించారు. తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గర్భవతి కావడం బిడ్డకు జన్మనివ్వబోతుండడం గొప్ప వరంగా భావిస్తున్నాను. ఈ క్షణాలను ఎంతగానో ఆస్వాదిస్తున్నా. ఇదొక గొప్ప అనుభూతి’’ అని ఇలియానా తెలిపారు. ప్రెగ్నెన్సీ సమయంలో మినీ క్యారెట్‌ తినాలనిపించేదని ఆమె చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే ఈ సమయంలో ఇండియన్‌ ఫుడ్‌ తినాలనుంది. మంచి బటర్‌ చికెన్‌, నాన్‌ తిని చాలా కాలమైంది. ముంబై పుడ్‌ను చాలా మిస్‌ అవుతున్నా’’ అంటూ ఇలా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఇల్లీ బేబి.

మీకు బీచ్‌ హౌస్‌ ఏదైనా ఉందా? (Ileana Beach House)

ప్రస్తుతానికేౖతే లేదు. నాకు బీచ్‌ అంటే ఇష్టం. అందుకే ఎక్కువ బీచ్‌లు ఉన్న ప్రాంతాలకు విహారానికి వెళ్తుంటా. ఆ ప్రశాంత వాతావరణం.. నా మనసును శాంతపరచి.. సంతోషంగా ఉండేలా చేస్తుంది.

Untitled-2.jpg

ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంది? (Ileana Pregnancy journey)

ఈ ప్రయాణం గురించి సింపుల్‌గా చెప్పలేను. చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అందరు మహిళలలాగే ఈ దశ మామూలుగానే సాగుతోంది. ఈ జర్నీని ఆస్వాదిస్తున్నా.

హీరోయిన్‌లు ఫిట్‌గా ఉండాలనుకుంటారు? ఇప్పుడు బరువు పెరగడం ఏమన్నా ఇబ్బందిగా ఉందా?

అవును నేనూ మనిషినే. కొన్ని సమయాల్లో బాధపడ్డా. మొదట్లో ఈ ప్రశ్న నన్నెంతో మదన పడేలా చేసింది. పిల్లలను కనే సమయంలో బరువు పెరగడం చూసి ఎదుటివాళ్లు కామెంట్స్‌ చేస్తుంటారు. అలాగే చెకప్‌ కోసం వైద్యుల వద్దకు వెళ్లిన ప్రతిసారీ అక్కడ బరువు చూస్తుంటారు. అలా, వెయిట్‌ పెరుగుతున్నామనే విషయం మన మనసులో పాతుకుపోతుంది. గత కొన్ని నెలలుగా నా శరీరాకృతి మారిన విధానానికి ఆనందిస్తున్నా. ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా చుట్టూ ఉన్న గొప్ప మనుషులు. నాలో ఒక ప్రాణి జీవం పోసుకుంటుందనే విషయాన్ని తరచూ గుర్తు చేేసవాళ్లు. కాబట్టి, ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరగడం అనేది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కాదు’’ అని ఇలియానా తెలిపారు.

Updated Date - 2023-06-25T17:25:32+05:30 IST