SilkSmitha: సిల్క్ స్మిత బంగారం, ఎప్పుడో చనిపోయిన ఆమె గురించి ఇలా మాట్లాడటం నీచం: తమ్మారెడ్డి
ABN , First Publish Date - 2023-05-02T14:12:54+05:30 IST
ఎప్పుడో 30 సంవత్సరాల కిందట చనిపోయిన సిల్క్ స్మిత గురించి ఇప్పుడు తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు మాటలు మాట్లాడటం నిజంగా నీచమైన సంస్కృతి అని చెప్పాడు నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాలకు విజయవాడ (Vijayawada) వచ్చినప్పుడు ఎన్టీఆర్ ని ప్రశంసించడంతో పాటు అతనితో వున్న తన అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత (TDP) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మీద ప్రశంశల జల్లు కూడా కురిపించాడు. అదే సమయంలో హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది అనే విషయం గురించి కూడా మాట్లాడేడు రజినీకాంత్. అతని మాటలు నిజమైన తట్టుకోలేని వైసీపీ నాయకులు, రజనీకాంత్ మీద నీచమైన దూషణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు. ఎప్పుడో చనిపోయిన సిల్క్ స్మిత (SilkSmitha) చావుకు, రజినీకాంత్ (Rajinikanth) కి ముడిపెట్టి నీచమైన కామెంట్స్ చేస్తూ సాంఘీక మాధ్యమాల్లో దిగజారి ప్రవర్తిస్తున్నారు.
ఇదే విషయం దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజని (Thammareddy Bharadwaj) అడిగితే, "ఇది అత్యంత బాధాకరం, హేయం, నీచమైన సంస్కృతి కూడా. సిల్క్ స్మిత చనిపోయి 30 సంవత్సరాలకి పైబడి అయింది. అప్పుడెప్పుడో చనిపోయిన ఆమె మీద ఇలా నీచమైన కామెంట్స్ చేస్తూ, ఆమె గురించి నిరాధారమైన మాటలు మాట్లాడటం చాలా బాధాకరం," అని చెప్పాడు తమ్మారెడ్డి.
సిల్క్ స్మిత తో తమ్మారెడ్డి పని చేసినట్టుగా చెప్పాడు. "నా సినిమాలో పని చేసింది స్మిత, ఆమె బంగారం. చాలా మంచి అమ్మాయి. అలాంటి ఆమె చావుని తీసుకొచ్చి ఇప్పుడు ఒక సూపర్ స్టార్ కి లింక్ పెట్టడం అనేది చాలా అసమంజసం," అని చెప్పాడు తమ్మారెడ్డి. అప్పట్లో #SilkSmitha ఆమె మృతిమీద ఎన్నో కథనాలు పేపర్లలో వచ్చాయి, అప్పుడు ఎవరిమీద అనుమానం లేదు అని అందరూ అన్నారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా ఆమె మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా బాధాకరం, అన్నాడు.
రాజకీయ ప్రత్యర్థుల్ని, రాజకీయాలతోనే ఎదిరించాలి కానీ ఇలా వ్యక్తిగత దూషణలకు, వ్యక్తిగతంగా ఒక అత్యున్నత వ్యక్తిని ఆధారాలు ఏమి లేకుండా వ్యక్తిగతంగా కించపర్చటం ఎంతమాత్రం మంచింది కాదు. ఇది కండించాల్సిన విషయం. ఇలాంటి నీచమైన సంస్కృతికి తెర దించాలి ఇప్పటికయినా అని చెప్పాడు తమ్మారెడ్డి. సిల్క్ స్మిత రాసిన ఉత్తరం గురించి అడిగితే, అప్పట్లో ఆమె రాసిన ఉత్తరం ఒకటి బయట పడింది అన్నారు, కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్న సిల్క్ స్మిత రాసిన ఉత్తరం అప్పుడు దొరికిన ఉత్తరం ఒక్కటో కాదో మాత్రం నాకు తెలీదు. కానీ అందులో ఎవరి గురించి అయినా రాసి ఉంటే అప్పట్లోనే ఆమె రాసిన వాళ్ళ పేర్లు లిస్టులో వాళ్ళని అడిగేవారు కదా. అంటే అందులో ఎవరి పేరు రాయలేదు అనే కదా. అది అంతా కూడా ఎవరో సృష్టిస్తున్నవే, అని అన్నాడు.