Jr Ntr : తండ్రి జ్ఞాపకాలు తలుచుకుంటూ...

ABN , First Publish Date - 2023-09-02T13:35:32+05:30 IST

తన తండ్రి నందమూరి హరికృష్ణ 67వ జయంతి సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ఆగస్ట్‌ 29, 2018లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఓ అభిమాని పెళ్లికి హాజరు కావడం కోసం నెల్లూరు జిల్లా కావలికి కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తుండగా నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆయన మరణించారు

Jr Ntr : తండ్రి జ్ఞాపకాలు తలుచుకుంటూ...

తన తండ్రి నందమూరి హరికృష్ణ (nandamuri Hari Krishna) 67వ జయంతి సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr ntr) భావోద్వేగ పోస్ట్‌ చేశారు. ఆగస్ట్‌ 29, 2018లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. ఓ అభిమాని పెళ్లికి హాజరు కావడం కోసం నెల్లూరు జిల్లా కావలికి కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తుండగా నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆయన మరణించారు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తారక్‌, కల్యాణ్‌రామ్‌ ట్వీట్‌ చేశారు. (Kalyan ram)

‘‘ఈ అస్తిత్వం మీరు..

ఈ వ్యక్తిత్వం మీరు..

మొక్కవోని ధైర్యంతో కొనసాగే

మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు..

ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’’ అంటూ భావోద్వేంగా పోస్ట్‌ చేశారు.

Updated Date - 2023-09-02T13:35:32+05:30 IST