Aunty: ఈ పేరు అంటేనే కొందరికి కోపం, కానీ కొందరకు ఆలా పిలవటమే ఇష్టం

ABN , First Publish Date - 2023-04-04T16:36:22+05:30 IST

ఒకరేమో తాను 'ఆంటీ' అయ్యాను అని సంతోషంగా చెప్పింది. ఇంకో ఆమెకేమో ఆ పదం వింటేనే కోపం, హర్ట్ అయ్యాను అంటుంది. ఇంతకీ ఎవరికీ సంతోషము, ఎవరికీ కోపం తెలియాలంటే...

Aunty: ఈ పేరు అంటేనే కొందరికి కోపం, కానీ కొందరకు ఆలా పిలవటమే ఇష్టం

ఈమధ్య 'ఆంటీ' (Aunty) అనే పదం సాంఘీక మాధ్యమం లో చాలా వైరల్ అయింది. ఒక యాంకర్ (Anchor/Actress), నటి ని పట్టుకొని కొందరు నెటిజన్స్ ఆ మాట పెట్టి పిలిస్తే ఆమె చాలా హర్ట్ అయింది కూడా. అలాగే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు కూడా చేసింది ఆమె. అయితే ఆమె మళ్ళీ మీకు ఆంటీ (#Aunty) అంటే ఎందుకు కోపం అని అని ఈమధ్య ఇన్ స్టాగ్రామ్ లో ప్రశ్న అడిగితే ఆమె దానికి జవాబు కూడా చెప్పింది. వాళ్ళు వేరే విధంగా ఆలా అంటున్నారని చెప్పింది. సరే లెండి, ఆమె ఆలా అనుకుంది, ఆమె అన్నదాంట్లో కూడా తప్పు లేదని అనుకుందాం.

jwalagutta2.jpg

కానీ ఇక్కడ అధికారికంగా నేను ఆంటీ ని అయ్యాను అని ప్రకటించింది ఇంకొకామె. ఆమె మరెవరో కాదు, అందరికీ ముఖ్యంగా బాడ్మింటన్ (Badminton Player) ఆటను నచ్చేవాళ్ళకి ఆమె ఇంకా సుపరిచతురాలు కూడా. ఆమె మరెవరో కాదు తెలుగు అమ్మాయి జ్వాలా గుట్ట (Jwala Gutta).

రెండేళ్ల క్రితం జ్వాలా గుట్ట తమిళ నటుడు విష్ణు విశాల్ (Vishnu Vishal) ని పెళ్లి చేసుకుంది. అలాగే జ్వాలా గుట్ట నితిన్ (Nithiin) నటించిన ఒక తెలుగు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. ఆమెకి చాలా సాంఘీక మాధ్యమాల్లో చాలా ఫాలోయింగ్ కూడా వుంది. అలాగే తన భర్త విష్ణు విశాల్ సినిమా ఈవెంట్స్ లో కూడా కనపడుతూ ఉంటుంది.

jwalagutta.jpg

ఇంతకీ విషయం ఏంటి అంటే, జ్వాలా గుట్ట చెల్లెలుకి బాబు పుట్టాడు అని చెప్పింది. అందువల్ల జ్వాలా గుట్ట అధికారికంగా ఆంటీ/ పెద్దమ్మ (#Aunty) అయ్యాను అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. చెల్లెలుకి బాబు పుడితే ఆమె మరి పెద్దమ్మ/ ఆంటీ నే కదా, అందులో హర్ట్ అవటానికి ఏముంది. ఏమీ లేదు. జ్వాలా గుట్ట లా ఇలా చాలా తేలికగా తీసుకుంటే బాగుంటుందేమో. జ్వాలా కి అందరూ కంగ్రాట్యులేషన్స్ మెసేజ్ లు పెడుతున్నారు.

Updated Date - 2023-04-04T16:37:49+05:30 IST