Rajamouli-Vijayendra Prasad: ఆ చిత్రానికి రాజమౌళి దర్శకుడు కాకపోవచ్చు!
ABN , First Publish Date - 2023-07-10T16:11:10+05:30 IST
భారతీయ ఇతిహాసమైన ‘మహాభారతం’ ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా ఓ సినిమా చేయాలని ఎస్.ఎస్.రాజమౌళి కోరిక. అది ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా గురించి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఆయన వెల్లడించారు.
భారతీయ ఇతిహాసమైన ‘మహాభారతం’ (Mahabharatam)ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా ఓ సినిమా చేయాలని ఎస్.ఎస్.రాజమౌళి (Rajamouli) కోరిక. అది ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమా గురించి ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ (Vijayendra prasad) తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఆయన వెల్లడించారు. అంతే కాకుండా ‘ఆర్‌ఆర్‌ఆర్2’ (RRR2) సీక్వెల్, ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (SSMB29) సినిమాల గురించీ ఆయన మాట్లాడారు.
‘‘మహేశ్‌బాబు, కాంబినేషన్‌లో రాబోతున్న అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని మించి ఈ సినిమా ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ - రామ్‌చరణ్‌లతో ‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్‌కు రంగం సిద్థం చేస్తున్నాం. ఒక హాలీవుడ్ చిత్రంగా దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నాం. దీనికి రాజమౌళి దర్శకత్వం వహిస్తారా లేదా హాలీవుడ్ డైరెక్టర్ వర్క్ చేస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే రాజమౌళి పర్యవేక్షణలోనే ఆ సినిమా రూపుదిద్దుకుంటుంది. మహేశ్ సినిమా పూర్తైన వెంటనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే రాజమౌళి పలు సందర్భాల్లో ‘మహాభారతం’ చిత్రం గురించి మాట్లాడారు. ‘‘భారీగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేయాలి. భారతీయ కథలను ప్రపంచానికి చాటి చెప్పాలి. మహాభారతం నా చిరకాల ప్రాజెక్ట్. ఆ మహాసముద్రంలోకి అడుగు పెట్టడానికి చాలా సమయం పడుతుంది. ‘మహాభారతం తీస్తే పది భాగాలుగా తీయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎన్ని విభాగాలుగా అవుతుందో కచ్చితంగా చెప్పలేను’’ అని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే!