The kerala Story: కమల్‌హాసన్ వ్యాఖ్యలు.. దర్శకుడి స్పందన!
ABN , First Publish Date - 2023-05-30T11:16:49+05:30 IST
హిందీలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరి’ చిత్రంపై ఇప్పటికే పలు రకాల వివాదాలు చెలరేగాయి. కేరళ ప్రజలు, ప్రభుత్వం నుంచే కాకుండా తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా సినిమాపై వ్యతిరేకత మొదలైంది.
హిందీలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరి’ (the kerala story) చిత్రంపై ఇప్పటికే పలు రకాల వివాదాలు చెలరేగాయి. కేరళ ప్రజలు, ప్రభుత్వం నుంచే కాకుండా తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా సినిమాపై వ్యతిరేకత మొదలైంది. దీంతో కేరళ, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ చిత్రంపై నిషేదం విధించాయి. తమిళనాడు థియేటర్ల యాజమాన్యం కూడా ది కేరళ స్టోరీ చిత్ర ప్రదర్శన రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వినోద పనున మినహాయించాయి. సుప్రీంకోర్టు కూడా ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై నిషేదాన్ని కొట్టివేసింది. ఇన్ని వివాదాల మధ్య ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం విజయవంతమైంది. దాదాపు రూ.200 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ (Kamal Haasan Comments) తాను పబ్లిసిటీ చిత్రాలకు వ్యతిరేకినని చెప్పారు. వాస్తవ కథ అంటూ ఏదో ఓ అంశాన్ని తీసుకుని సినిమాగా మలిస్తే అది నిజం కాదని అన్నారు. ‘ది కేరళ స్టోరీ’ చిత్రంలో చూపించిన సన్నివేశాలు నిజం కాదని కమల్ పేర్కొన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు సుదీప్తో సేన్ (Sudipto sen counter) స్పందించారు. ‘ది కేరళ స్టోరీ ప్రచార చిత్రమంటూ కమల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. సినిమా చూస్తే అభిప్రాయాలు తప్పకుండా మారతాయని అన్నారు. ఈ మేరకు దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ ‘‘ది కేరళ స్టోరీ’ని ప్రచార చిత్రమంటూ ఎవరైనా కామెంట్ చేేస్త మొదట్లో నేను స్పందించేవాడిని. ఇప్పుడు బదులివ్వాలనుకోవడం లేదు. మా చిత్రాన్ని ఎవరైతే ప్రచార చిత్రమంటూ వ్యాఖ్యలు చేశారో.. సినిమా చూశాక వాళ్లే తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. సినిమా బాగుందని చెబుతున్నారు. సినిమాని చూడని వాళ్లే ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో మా సినిమాపై బ్యాన్ విధించారు. దాంతో ఆ రాష్ట్ర ప్రజలు మా చిత్రాన్ని వీక్షించలేదు. అందువల్లే వాళ్లు దీన్ని ఒక ప్రచార చిత్రంగా భావిస్తున్నారు. మన దేశంలో మూసధోరణిని ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. జీవితమంటే కేవలం తెలుపు లేదా నలుపులోనే ఉండాలని అనుకుంటారు. కానీ జీవితంలో గ్రే షేడ్ కూడా ఉంటుందని వారికి తెలియదు’’ అంటూ సుదీప్తో సేన్ వ్యాఖ్యలు చేశారు. అదాశర్మ (adah sharma) ప్రధాన పాత్రలో సిద్ది ఇద్నానీ తదితరులు నటించిన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే!