Kanal Kannan: ఆ వీడియో పోస్ట్ చేయడం వల్లే...
ABN , First Publish Date - 2023-07-11T18:39:38+05:30 IST
టాలీవుడ్, కోలీవుడ్‌లో ఫైట్ మాస్టర్‌గా పని చేస్తున్న కనల్ కన్నన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కోయిల్‌కి చెందిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితం ఓ వీడియో పోస్ట్ చేసిన ఆయన ఓ మతం వారి మనోభావాలను దెబ్బతీశాడు. ఈ కారణంగానే ఇప్పుడు ఆయన్ను జైల్లో పెట్టారు.

ఓ యువతితో పాస్టర్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను గత నెల 18వ తేదీన తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో మన దేశానికి సంబంధించినది కానప్పటికీ దాన్ని కనల్ కన్నన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఇది సైబర్ క్రేౖమ్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో సోమవారం ఈయన్ని అదుపులోకి తీసుకున్నారు. కనల్ కన్నన్‌కి ఇలా అరెస్ట్ కావడం కొత్తేం కాదు. గతంలోనూ సోషల్ యాక్టివిస్ట్ పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జైలు పాలయ్యాడు.