Rashmika Mandanna Fake video : రష్మికకు పెరుగుతోన్న మద్దతు
ABN , First Publish Date - 2023-11-09T11:18:17+05:30 IST
మార్ఫింగ్ (Rashmika Deep Fake video) వీడియోను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు మద్దతు పెరుగుతోంది. సినీ రాజకీయ నాయకులు ఆమెకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లను హెచ్చరించింది.
మార్ఫింగ్ (Rashmika Deep Fake video) వీడియోను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియా వేదికగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు మద్దతు పెరుగుతోంది. సినీ రాజకీయ నాయకులు ఆమెకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లను హెచ్చరించింది. రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియోను 36 గంటల్లోగా తొలగించాలని, ఎక్కడా కనిపించకూడదని ఆదేశించింది. అలాగే ఇలాంటి వీడియోలకు సంబంధించిన నిబంధనలను గుర్తు చేసింది. ఈ మేరకు ఓ అడ్వయిజరీని జారీ చేసింది. డీప్‌ఫేక్ వంటి వీడియోల క్రియేషన్, సర్క్యులేషన్‌కు సంబంధించిన పెనాలీలని, రూల్స్‌ను గుర్తు చేస్తూ కేంద్ర ఎలక్ర్టానిక్స్, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా సంస్థలకు అడ్వయిజరీని పంపించింది. దీనిపై తాజాగా హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రష్మికకు మద్దతుగా పోస్ట్ పెట్టారు. (Vijay Devarakonda)
"భవిష్యత్తు కోసం ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. మరో మహిళకు ఇలా జరగకూడదు. ఈ తరహా చర్యలు జరిగినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అందుకుగానూ ఓ సమర్థవంతమైన వింగ్‌ను ఏర్పాటు చేయాలి. ఇలాంటి ఘటనటకు పాల్పడే వారిని వెంటనే శిక్షించాలి. అప్పుడే సొసైటీలో స్త్రీలకు రక్షణ ఉంటుంది’’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
'మా’ ఉపేక్షించదు : మంచు విష్ణు (Manchu Vishnu)
ఇదే విషయంపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించారు. టెక్నాలజీ ఉపయోగించి ఇలాంటి వీడియోలను సృష్టించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీప్ ఫేక్ వీడియో ఘటనపై రష్మికకు ుమా’ పూర్తి మద్దతు ఉందని చెప్పారు. ఏఐ టెక్నాలజీ సాయంతో నటీనటుల రక్షణకు భంగం కలిగించే వీడియోలను ‘మా’ ఉపేక్షిందని పేర్కొన్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి, సమర్ధ మార్గదర్శకాలను అభివృద్ధి చేయడానికి ఎఐ ప్రొఫెషనల్స్‌ను సంప్రదిస్తున్నామని చెప్పారు. ఈ తరహా చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విషయంపై పొరుగు చిత్ర పరిశ్రమల పెద్దలతో కూడా చర్చలు జరిగి యాక్షన తీసుకుంటామని తెలిపారు.
ఇది వరమా? శాపమా? : కీర్తి సురేష్ (Keerthy suresh)
రష్మికకు మద్దతుగా నటి కీర్తి సురేష్ కూడా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మన చుట్టూ జరుగుతున్న డీప్‌ఫేక్ వీడియోలు చూస్తుంటే భయమేస్తోంది. దీనిని క్రియేట్ చేసిన వ్యక్తి ఆ సమయాన్ని ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ పర్పస్‌కి ఉపయోగిస్తే జీవితంలో ఓ మెట్టు ఎక్కొచ్చు. అతను చేసే పని వల్ల అందులో భాగమైన ఇతరులు ఇబ్బంది పడతారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ మనకు వరమో? శాపమో కూడా అర్థం కావడం లేదు. ఈ టెక్నాలజీని చేసే పనిలో ఎదుగుదలకు, ప్రేమను పంచడానికి, అవగాహన కల్పించడానికి, సమాచారాన్ని విస్తరించడానికి ఉపయోగించుకుంటే బావుంటుంది. అర్థం లేనివాటి కోసం ఉపయోగించడం సరైన పద్దతి కాదు. ఇలాంటి చర్యల నుంచి ఈ మానవాళిని భగవంతుడే రక్షించాలి’’ అని కీర్తి సురేష్ అన్నారు.