Ketika Sharma: పాన్‌ ఇండియా స్టార్‌తో చిట్‌చాట్‌ నమ్మలేకపోయా!

ABN , First Publish Date - 2023-07-23T10:47:19+05:30 IST

చేతిలో సినిమాలున్నా లేకున్నా హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ‘రొమాంటిక్‌’ బ్యూటీ కేతిక శర్మ. తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా తన గ్లామర్‌తో అందర్నీ కట్టిపడేసింది. పవన్‌కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ల కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్రో’తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఈ ఢిల్లీ బ్యూటీ చెబుతున్న కబుర్లివి...

Ketika Sharma:  పాన్‌ ఇండియా స్టార్‌తో చిట్‌చాట్‌ నమ్మలేకపోయా!

చేతిలో సినిమాలున్నా లేకున్నా హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ‘రొమాంటిక్‌’ బ్యూటీ కేతిక శర్మ(ketika Sharma). తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా తన గ్లామర్‌తో అందర్నీ కట్టిపడేసింది. పవన్‌కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ల (Sai dharam tej) కాంబినేషన్‌లో వస్తున్న ‘బ్రో’(bro)తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఈ ఢిల్లీ బ్యూటీ చెబుతున్న కబుర్లివి...

ఇంట్లో అందరూ డాక్టర్లే

నేను పుట్టి పెరిగిందంతా ఢిల్లీలోనే. మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. నన్ను కూడా వైద్యురాలిగా చూడాలనేది మా నాన్న కల. కాని నాకేమో నటన మీద ఆసక్తి ఉండడంతో ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క డబ్‌స్మాష్‌ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌ చేసేదాన్ని. అవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘థగ్‌ లైఫ్‌’ వీడియో నాకు క్రేజ్‌ తీసుకొచ్చింది. దాంతో సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో వాళ్లకి చెప్పినప్పుడు ఏడాది సమయం ఇచ్చారు. అదృష్టవశాత్తు వారిచ్చిన గడువులోపే నటినయ్యా.

Ketika.jpg

ఫేక్‌ కాల్‌ అనుకున్నా...

ఓ రోజు ‘పూరి కనెక్ట్స్‌’ బ్యానర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ‘పూరీ సార్‌ మిమ్మల్ని కలవాలంటున్నారు. హైదరాబాద్‌ రావాల’ని అడిగారు. ‘అంత పెద్ద డైరెక్టర్‌ నన్నెందుకు పిలుస్తారు? ఇదేదో ఫేక్‌ కాల్‌’ అనుకుని మొదట తిరస్కరించా. కాని అది నిజమైన కాల్‌ అని తర్వాత తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను చూసి, నచ్చి కాల్‌ చేశారట. వెంటనే విమానం ఎక్కి హైదరాబాద్‌లో వాలిపోయా. ఈరోజు నేను హీరోయిన్‌గా ఉన్నానంటే అది ఇన్‌స్టా వల్లే.

నో... ఓటీటీ... (No Ott)

నాకు సాయిపల్లవి అంటే చాలా ఇష్టం. ఆమె హావభావాలను చక్కగా పలికిస్తూ సహజంగా నటిస్తుంది. జీవితాంతం గుర్తిండిపోయే ఒక మరపురాని క్షణం అంటే.. ‘రొమాంటిక్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ గారు నన్ను ఇంటర్వ్యూ చేయడం. మా ఇంట్లో ఎవరూ దక్షిణాది సినిమాలను పెద్దగా చూసింది లేదు. కానీ ‘బాహుబలి’ అందరికీ తెలుసు. అలాంటి పాన్‌ ఇండియా స్టార్‌తో చిట్‌చాట్‌ అంటే నమ్మలేకపోయా. ఆయన చాలా సింపుల్‌ పర్సన్‌. బయోపిక్‌ చిత్రాల్లో నటించాలనేది నా డ్రీమ్‌. ఓటీటీల్లో నటించాలనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు.

వైవిధ్యం ముఖ్యం

ఒకే రకమైన కథలను ఎంపిక చేసుకోను. సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా చూసుకుంటా. నా మూడు సినిమాలూ మూడు నేపథ్యాల్లో ఉంటాయి. నెటిజన్లు ఒక్కోసారి నాపై విపరీతంగా కామెంట్లు చేస్తుంటారు. ప్రశంసలని, విమర్శలని ఒకే విధంగా స్వీకరిస్తా. ఏ విషయంలో వెనకబడి ఉన్నానో చెక్‌ చేసుకుని మరింత మెరుగ్గా నటించేందుకు విమర్శలు పనికొస్తాయనేది నా నమ్మకం.

Ketika.jpeg-2.jpg

ఆ పాట నేనే పాడా

నేను రాష్ట్రస్థాయి స్విమ్మర్‌ని. పాటలు కూడా బాగా పాడుతా. నా మొదటి చిత్రంలో ‘నా వల్ల కాదే’ పాట నేనే పాడాను. అది పెద్ద హిట్‌ అయ్యింది. బిర్యానీ అంటే పిచ్చి. హైదరాబాదీ బిర్యానీకి ఫిదా అయిపోయా. షూటింగ్‌ సమయంలో ఎక్కువగా కొబ్బరినీళ్లు తాగుతుంటా. దానివల్ల శరీరం డీహైడ్రేట్‌ కాకుండా ఉంటుంది. ఫిట్‌నెస్‌ విషయంలో మా అన్నయ్యే నాకు ప్రేరణ. ఆయన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌.

ఛాలెంజ్‌ చేశా...

షారుక్‌ఖాన్‌, మాధురీ దీక్షిత్‌ నటించిన ‘దిల్‌ తో పాగల్‌ హై’ సినిమా చూస్తున్నప్పుడే ఫిక్స్‌ అయిపోయా పెద్దయ్యాక వాళ్లలా స్టార్‌ అవ్వాలని. ఎనిమిదో తరగతిలో స్నేహితులతో కలసి ఏదో సినిమాకి వెళ్లాను. థియేటర్‌ నుంచి బయటకి వచ్చాక ‘మీరంతా నన్ను వెండితెరపై చూసే రోజు వస్తుంద’ని ఛాలెంజ్‌ చేశా. ఇప్పుడది తలుచుకుంటే నవ్వొస్తుంది.

Updated Date - 2023-07-23T10:56:58+05:30 IST