Kishore: సస్పెండ్‌ కాలేదు.. హ్యాక్‌ చేశారు...

ABN , First Publish Date - 2023-01-05T18:23:06+05:30 IST

కన్నడ నటుడు కిశోర్‌ ట్విట్టర్‌ ఖాతా ఇటీవల సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే! గత రెండ్రోజులుగా ఈ విషయంపై చర్చ నడుస్తోంది. కిశోర్‌ ట్విట్టర్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అందుకే ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేశారని కొందరు అంటున్నారు.

Kishore: సస్పెండ్‌ కాలేదు.. హ్యాక్‌ చేశారు...

కన్నడ నటుడు కిశోర్‌(KIshore) ట్విట్టర్‌ ఖాతా ఇటీవల సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే! గత రెండ్రోజులుగా ఈ విషయంపై చర్చ నడుస్తోంది. కిశోర్‌ ట్విట్టర్‌ (not suspended) (kishore twitter)నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అందుకే ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేశారని కొందరు అంటున్నారు. ఆయన చేఏ పోస్ట్‌ల వల్లే సస్పెండ్‌ అయిందని మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై కిశోర్‌ క్లారిటీ ఇచ్చారు. తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేయడం వల్లే ఇలా జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. అంతే కాన తను చేసే పోస్ట్‌ల వల్ల కాదని క్లారిటీ ఇచ్చారు. ‘‘నా ట్విటర్‌ ఖాతా సస్పెన్షన్‌పై అపోహలు నివారించండి నా పోస్ట్‌ వల్ల ఖాతాను సస్పెండ్‌ చేయలేదు. డిసెంబర్‌ 20న నా అకౌంట్‌ హ్యాక్‌ అయింది. దానికి సంబంధించి తగన చర్యలు తీసుకంటామని ట్విటర్‌ హామీ ఇచ్చింది. ఇక దీనిపై అనవసర రాద్దాంతం వద్దు’’ అని అన్నారు. ఇటీవల ‘కాంతార’, ‘పొన్నియిన్‌ సెల్వన్‌1 చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన తెలుగులో హ్యాపీ తదితర చిత్రాల్లో చక్కని పాత్రలతో మెప్పించారు.

Updated Date - 2023-01-05T18:23:08+05:30 IST