Krithi shetty: దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దు!
ABN , First Publish Date - 2023-07-07T12:50:34+05:30 IST
తొలి సినిమా ‘ఉప్పెన’తో బేబమ్మగా మెప్పించి ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాలతో కూడా బిజీ అయ్యారు. తాజాగా బేబమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
తొలి సినిమా ‘ఉప్పెన’(Uppena) తో బేబమ్మగా మెప్పించి ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు బెంగుళూరు బ్యూటీ కృతిశెట్టి. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ, మలయాళ చిత్రాలతో కూడా బిజీ అయ్యారు. తాజాగా బేబమ్మకు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తనతో స్నేహం చేయాలని ఓ స్టార్ హీరో తనయుడు ఆమెకు ఫోన్ చేసి విసిగిస్తున్నాడని, ఎక్కడికి వెళ్లినా తనతో రావాలని వేధిస్తున్నాడని కృతీశెట్టి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు పలు వెబ్‌సైట్స్ కథనాలు రాసుకొచ్చాయి. గత కొంతకాలంగా ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై తాజాగా కృతిశెట్టి (Krithi shetty) స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
‘‘దయచేసి ఇలాంటి కథనాలు సృష్టించి.. అసత్య ప్రచారాలు చేయడం మానండి. ఆధారాలు లేని వార్తల గురించి పట్టింటచుకోకూడదని, టైమ్ వేస్ట్ అని అనుకున్నారు. ఓపికగా ఉండే కొద్దీ ఇలాంటి వార్తలు ఎక్కువవుతున్నాయి. దాంతో స్పందించక తప్పడం లేదు’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. కృతీ ట్వీట్‌తో అయినా ఈ కథనాలు ఆగుతాయో లేదో చూడాలి. ఇటీవల ‘కస్టడీ’తో అలరించిన ఈ బ్యూటీ సరైన విజయం కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఈమె ‘అజాయంతే రందం మోషణం’ అనే మలయాళం సినిమాలో నటిస్తున్నారు. జయం రవి ‘జీని’ చిత్రంలో ఛాన్స్ అందుకొంది.