Guntur Karam: హైదరాబాద్‌లో సెట్‌... ఆ సన్నివేశాల్లో కొత్తగా..

ABN , First Publish Date - 2023-07-08T10:19:59+05:30 IST

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఇటీవల తాజా షెడ్యూల్‌ మొదలైన సంగతి తెలిసిందే! ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. శనివారం నుంచి హైదరాబాద్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్రారంభించనున్నారని సమాచారం.

Guntur Karam: హైదరాబాద్‌లో సెట్‌... ఆ సన్నివేశాల్లో కొత్తగా..

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ (Trivikram) తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’(Guntur Karam). ఇటీవల తాజా షెడ్యూల్‌ మొదలైన సంగతి తెలిసిందే! ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. శనివారం నుంచి హైదరాబాద్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను (Action scenes) ప్రారంభించనున్నారని సమాచారం. దీని కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను తయారు చేశారని చిత్ర వర్గాల నుంచీ సమాచారం అందింది. మహేశ్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై ఈ యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఈ సన్నివేశాల్లో మహేశ్‌ కొత్తగా కనిపిస్తారనీ, అందుకోసం ప్రత్యేకంగా తయారయ్యారని టాక్‌.

గుంటూరు నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌గా రూపొందుతున్న చిత్రమిది. శ్రీలీల కథానాయిక. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న విడుదల ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రానికి నిర్మాత.

Updated Date - 2023-07-08T10:32:54+05:30 IST