Manchu Lakshmi: ఈ పదేళ్లలో మరో స్థాయిలో ఉండేదాన్ని.. తెర వెనకే ఎందుకు ఉండాలి!
ABN , First Publish Date - 2023-07-06T15:08:43+05:30 IST
తెలుగు సినిమా మేకర్స్‌పై మంచు లక్ష్మీ ప్రసన్న కామెంట్ చేశారు. ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలు ఎంతోమంది ఉండగా వారిని హీరోయిన్లుగా ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు హాలీవుడ్లో ఉండుంటే మరోస్థాయిలో ఉండేదానినంటూ వైరల్ కామెంట్స్ చేశారు.
తెలుగు సినిమా మేకర్స్‌పై మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu Lakshmi) కామెంట్ చేశారు. ప్రతిభ ఉన్న తెలుగు అమ్మాయిలు (Telugu Heroines) ఎంతోమంది ఉండగా వారిని హీరోయిన్లుగా ఎందుకు ప్రోత్సహించడం లేదని ఆమె ప్రశ్నించారు. అంతేకాదు హాలీవుడ్లో ఉండుంటే మరోస్థాయిలో ఉండేదానినంటూ వైరల్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Manchu Lakshmi Viral Comments)
‘మీరు హాలీవుడ్లో ఓ సిరీస్, సినిమా చేశారు. అక్కడే ఉంటే కెరీర్ మరోలా ఉండేదేమో కదా? మా తెలుగమ్మాయి హాలీవుడ్లో రాణిస్తోంది అని మేం కూడా గర్వంగా చెప్పుకునేవాళ్లం’’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ‘‘నేను హాలీవుడ్ ఒక సిరీస్, సినిమా చేసి వదిలేయలేదు. నేను హాలీవుడ్ యాక్టర్‌ని. ఖర్మ కొద్ది అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చేశా. ఈ పదేళ్లు అక్కడే ఉండుంటే నేను ఎక్కడో ఉండేదాన్ని. పాప కావాలి అనుకున్నప్పుడు ఇండియా వచ్చేయాలని డిసైడ్ అయ్యా. పిల్లల విషయంలో ఇక్కడ ఉన్న కంఫర్ట్, కేరింగ్ మరెక్కడా ఉండదు. ఇప్పుడు పాపకు తొమ్మిదేళ్లు. మాక్కూడా రెక్కలొచ్చాయి. అందుకే ఇతర అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాం. మళ్లీ అబ్రాడ్ వెళ్లే అవకాశం దేవుడు ఇస్తే ఒక్క క్షణం ఆలోచించకుండా ఫ్లైట్ ఎక్కేస్తా’’ అని అన్నారు.
ఓ పక్క సినిమాలు, నిర్మాణ రంగం, మరో పక్క టీవీ షోలతో బిజీగా ఉండే మంచు లక్ష్మీ తెలుగు హీరోయిన్స్, వారి అవకాశాల విషయమై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిభ ఉండి కూడా అవకాశాలు అందుకోలేకబోతున్నారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఈ విషయంపై మేకర్స్ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా ఆలోచించాలి. మన వాళ్లు ఇతర రాష్ట్రాల హీరోయిన్లనే ఎక్కువగా ఆదరిస్తున్నారు. తెలుగు హీరోయిన్లను మాత్రం ఆదరించరు. ఇక్కడి వారిని ఒక్కశాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉంటారు. నీహారిక, మధు శాలిని, బిందు మాధవి, శివానీ, శివాత్మిక వీళ్లందరికి ఏం తక్కువ. ఎందుకు అవకాశాలు రావడం లేదు. మేకర్స్ ఓసారి ఆలోచించాలి. నిర్మాణ సంస్థలు మనవి.. హీరోయిన్లు మాత్రం ఇతర రాష్ట్రాల వారు? నిర్మాతల బిడ్డలుగా పుడితే తెర వెనకే ఉండాలా? ఆన్ స్ర్కీన్ కనిపించకూడదా? ఇదెక్కడి న్యాయం’’ అంటూ మండిపడ్డారు మంచు లక్ష్మీ ప్రసన్న. ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు మద్దతిస్తున్నారు.