Manchu Manoj: లార్డ్ శివ దర్శకత్వంలో పెళ్లి మొత్తాన్ని పాటగా!
ABN , First Publish Date - 2023-04-18T11:21:14+05:30 IST
మంచు మనోజ్ - భూమా మౌనిక రెడ్డి మార్చి మూడో తేదీన వివాహబంధంలో ఒకటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ బంధంలో ఉన్న వీరిద్దరూ మూడు ముళ్లు, ఏడడుగులతో బంధాన్ని బలపరుచుకున్నారు.
మంచు మనోజ్ (Manoj Manchu - భూమా మౌనిక రెడ్డి (mounika reddy) మార్చి మూడో తేదీన వివాహబంధంలో ఒకటయ్యారు. 12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ బంధంలో ఉన్న వీరిద్దరూ మూడు ముళ్లు, ఏడడుగులతో బంధాన్ని బలపరుచుకున్నారు. అయితే మనోజ్ వివాహం కుటుంబ సభ్యులు, అతి తక్కువమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. మనోజ్ పెళ్లి తంతు మొత్తాన్ని ఓ పాట రూపంలో వీడియోగా తీర్చిదిద్దారు. (Marriage video)
‘ఏం మనసో.. ఏం మనసో..
ఏం వరసో.. ఏం వరసో..
నిను చూస్తూ నిలుచోలేనందే..’
అంటూ సాగే పాటను మంగళవారం విడుదల చేశారు. అందులో మనోజ్, మౌనికలను పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుగా చేసింది మొదలు.. ఇతర పూజా కార్యక్రమాలు, సంగీత్, మెహందీ, పెళ్లి వేడుక, అతిథుల ఆశీర్వచనాలు ఇలా ప్రతి అంశాన్ని చూపించారు. అంతే కాదు మౌనిక కుమారుడు ధైరవ్‌రెడ్డి బాఽధ్యతను మనోజ్ స్వీకరించినట్లు చేతిలో చేయి వేసినట్లు చూపించారు. ఇప్పటికే ఈ విషయంపై మనోజ్ స్పందించారు. ‘శివుని ఆజ్ఞ’ అంటూ ఓ పోస్ట్‌తో చెప్పకనే చెప్పారు. ఈ వీడియోతో మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. (Special song for manoj marriage)
ఎవరీ లార్డ్ శివ..
మనోజ్ విడుదల చేసిన పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, అచ్చు రాజమణి సంగీతం అందించారు. దర్శకత్వం వహించింది లార్డ్ శివ అని టైటిల్ కార్డ్‌లో వేశారు. లార్డ్ శివ అంటే దర్శకుడి పేరా లేక.. లయకారుడు ఆ పరమేశ్వరుడా అన్నది టాపిక్‌గా మారింది. ఇదంతా శివుని ఆజ్ఞతోనే జరుగుతోందని మనోజ్ ముందుగానే చెప్పాడు కాబట్టి శివుడే దీనికి డైరెక్షన్ అన్నట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.