Manchu Manoj Comments: బతికి కూడా వేస్ట్‌ అనిపించింది.. మనోజ్‌ మాటలు వైరల్‌!

ABN , First Publish Date - 2023-04-13T15:09:30+05:30 IST

12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ అనంతరం మంచు మనోజ్‌.. మౌనిక వివాహబంధంతో ఒకటయ్యారు. మార్చి 3న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.

Manchu Manoj Comments: బతికి కూడా వేస్ట్‌ అనిపించింది.. మనోజ్‌ మాటలు వైరల్‌!

12 ఏళ్ల పరిచయం, నాలుగేళ్ల ప్రేమ అనంతరం మంచు మనోజ్‌(Manchu manoj).. మౌనిక (mounika)వివాహబంధంతో ఒకటయ్యారు. మార్చి 3న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రేమ, పెళ్లి, అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు (manchu manoj interview) పంచుకున్నారు. మౌనికకు సాయంగా ఉండాలనుకుని ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఎన్ని తలుపులు మూస్తారో మూయండి చూద్దాం అనుకున్నా.. అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వెన్నెల కిశోర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆ ఇంటర్వ్యూ ప్రొమో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ అవుతోంది.

23.jpg

అసలు ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి అంటూ వెన్నెల కిశోర్‌ అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానమిచ్చారు మనోజ్‌ దంపతులు. ‘మేమిద్దరం కలిసినప్పుడు మనసులో నుంచి బబుల్స్‌, ఫ్లవర్స్‌ వస్తుండేవి.. మా ఇద్దరిలో నేనే రొమాంటిక్‌ అంటూ సిగ్గుపడుతూ చెప్పారు మనోజ్‌. ‘‘ఇన్ని రోజులు మనోజ్‌ కోపాన్ని ఎలా డీల్‌ చేస్తుందా ఈ అమ్మాయి అనుకున్నారు. ఇప్పుడు నా కోపాన్ని మనోజ్‌ ఎలా తట్టుకుంటారో.. చూడాలి’’ అంటూ నవ్వేశారు మౌనిక. ఇక్కడేదో ఆవిడ నవ్వుతూ ఉన్నారు కానీ బ్యాక్‌ ద కెమెరా మౌనిక ఎలా ఉంటారో నాకు తెలుసంటూ హాస్యం పండించారు వెన్నెల కిశోర్‌! (MAnoj about Mounika's love)

కష్టంలో పక్కన ఉండాలనుకున్నా..

మౌనికకు కష్టం వచ్చిన ప్రతిసారి వెళ్లి తన పక్కన ఉండాలనుకునేవాణ్ణి. అలా వెళ్లడానికి కాలు కదిపిన ప్రతిసారీ ఇబ్బందులు ఎదుర్కొన్నా. మనం అనుకున్నట్లుగానే ప్రేమించాం... నేను ఎటు పక్కన ఉన్నా.. అన్నది నాకే అర్థం కాలేదు. లవ్‌ లైఫ్‌... సినిమా ఏది కావాలో... తేల్చుకోవలసిన పరిస్థితి ఎదురైంది. నన్ను నమ్ముకుని ఓ బిడ్డతో ఓ అమ్మాయి లైఫ్‌ నిలబడి ఉంది. తనకు అండగా లేకపోతే.. బతికి కూడా వేస్ట్‌ అనిపించింది. ఎన్ని తలుపులు మూస్తారో మూయండి చూద్దాం అనుకున్నా.

Untitled-1.jpg

నీకే వదిలేస్తున్నా...: మౌనిక!

అమ్మ మరణించిన తర్వాత వచ్చిన పుట్టినరోజున అలా ఆకాశం వైపు చూస్తూ.. ‘అమ్మా నువ్వు ఎక్కడున్నా.. నాకేం కావాలో నీకు తెలుసు.. అంతా నీకే వదిలేస్తున్నా’ అని మనసులో అనుకున్నా. ఆ సమయంలో మనోజ్‌ ఆళ్లగడ్డకు రాడేమో అనుకున్నా.. కానీ ఆ రోజును జీవితంలో మరచిపోలేను.

Updated Date - 2023-04-13T15:09:31+05:30 IST