Kannappa: మంచు విష్ణు‘కన్నప్ప’.. తారాగణంలోకి కొత్తగా మరో ఇద్దరు స్టార్స్
ABN , First Publish Date - 2023-11-09T18:52:13+05:30 IST
ప్రస్తుతం మన దేశంలో తెరకెక్కుతున్న చిత్రాలన్నింటిలోకెల్లా కన్నప్ప చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ కన్నప్పపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి అమాంతం పెరిగింది. ఇప్పుడు ఈ భారీ తారాగణంలోకి కొత్తగా మరో ఇద్దరు స్టార్స్ వచ్చి చేరారు.
ప్రస్తుతం మన దేశంలో తెరకెక్కుతున్న చిత్రాలన్నింటిలోకెల్లా కన్నప్ప (Kannappa) చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ కన్నప్పపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు ఈ ప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ మూవీ స్థాయి అమాంతం పెరిగింది. ఇప్పుడు ఈ భారీ తారాగణంలోకి శరత్ కుమార్, డా.మోహన్ బాబు కూడా వచ్చి చేరారు.
తెలుగునాట కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు (Mohan Babu) గురించి తెలియని వారంటే ఉండరు. సినిమాల్లో ఆయన అద్భుతమైన నటనతోనే కాక, వాయిస్ తోనూ తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. చివరగా సన్నాఫ్ ఇండియా చిత్రంలో కనిపించిన ఆయన ఇప్పుడు ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తుండంతో చిత్రంపై మరింత బజ్ పెరిగింది.
అదేవిధంగా దక్షిణాదిలో శరత్ కుమార్ (Sharath Kumar)కు హీరోగా, క్యారెక్టర్ నటుడిగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ‘బన్నీ, భరత్ అనే నేను, నా పేరు సూర్య, జయ జానకీ నాయకా, భగవంత్ కేసరి’ వంటి సినిమాల్లో ఎంతో విలక్షణంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆయన ఇప్పుడు కన్నప్ప చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ నటులు కన్నప్ప సెట్స్ మీదకు రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఆగస్టులో శ్రీకాళహస్తిలోని గుడిలో లాంఛనంగా ప్రారంభించగా న్యూజిలాండ్ (New Zealand)లో శరవేగంగా జరుపుకుంటున్నది. సినిమా మొత్తం అక్కడే చిత్రీకరణ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈక్రమంలో మోహన్‌బాబు, శరత్‌కుమార్ అక్కడే షూట్‌లో పాల్గొన్నారు. మహాభారతం సీరియల్ తీసిన ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం చేస్తుండగా సబుర్రా సాయి మాదవ్, పరుచూరి గోపాలకృష్ణ రచన చేస్తున్నాఉ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.