Meenakshi Chaudhary: ఈ డెంటల్ డాక్టర్ ఈసారి ఎవరి పక్కన చేస్తోందో తెలుసా...

ABN , First Publish Date - 2023-03-20T11:39:33+05:30 IST

'హిట్ 2' లో అడివి శేష్ తో ముద్దు సన్నివేశాల్లో బాగా నటించి, పేరు సంపాదించిన ఈ డెంటల్ డాక్టర్ ఇప్పుడు ఇంకో తెలుగు సినిమా ఒప్పుకుంది. అది ఎవరితో అంటే...

Meenakshi Chaudhary: ఈ డెంటల్ డాక్టర్ ఈసారి ఎవరి పక్కన చేస్తోందో తెలుసా...
Meenakshi Chaudhary signed a new Telugu film opposite Vishwak Sen

ఆమధ్య అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'హిట్ 2' (HIt 2) ఘన విజయం సాధించింది. అడివి శేష్ తో పాటు ఆ సినిమాలో ఇంటిమసీ సన్నివేశాల్లో నటించిన కథానాయకురాలకి కూడా మంచి పేరు వచ్చింది. ఆమె ఎవరో కాదు మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). అందులో ఆమె నటనకు కూడా ప్రసంశలు బాగా వచ్చాయి. ఆ సినిమా విజయం తరువాత మీనాక్షి వెంటనే ఇంకో తెలుగు సినిమా ఒప్పుకోకుండా, మంచి కథ దొరికితే చేద్దాం అని ఎదురు చూసినట్టుగా తెలిసింది.

meenakshichaudhary5.jpg

అయితే ఆమెకి హిట్ (Hit) కి వున్న బంధం బాగానే కొనసాగుతోంది. 'హిట్ 2' కన్నా ముందు 'హిట్' వచ్చింది, అది కూడా హిట్ అయింది. అందులో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించాడు. అయితే ఇప్పుడు మీనాక్షి అదే విశ్వక్ సేన్ తో ఒక సినిమా చెయ్యడానికి కొత్త సినిమా ఒప్పుకుంది. ఆ సినిమా నిన్న ఆదివారం రామానాయుడు స్టూడియో (Ramanaidu Studio) లో అధికారికంగా లాంచ్ అయింది. దీనికి దర్శకుడు రవితేజ ముళ్ళపూడి (Raviteja Mullapudi). రామ్ తాళ్లూరి (Ram Talluri) నిర్మాత.

meenakshichaudhary3.jpg

"రామ్ తాళ్లూరి నిర్మాణంలో సినిమా చేయడం చాలా ఎక్సయిటింగా వుంది. నాకు ఎప్పటి నుంచే విశ్వక్ సేన్ పని చేయాలని వుండేది, అది ఇలా ఈ సినిమా కుదిరింది" అని చెప్పింది మీనాక్షి. ఈ సినిమా లో నాది చాలా మంచి పాత్ర, అలాగే దర్శకుడు రవితేజ ముళ్ళపూడి మంచి స్క్రిప్ట్ తో వస్తున్నాడు. ఇంత మంచి టీం తో కలసి పని చేయడం చాలా హ్యాపీ గా వుంది, ఎప్పుడెప్పుడు షూటింగ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నా అని చెప్పింది.

meenakshichaudhary.jpg

సినిమాలకి రాక ముందు మీనాక్షి చౌదరి అందాల పోటీల్లో పాల్గొంది. ఆమె స్కూల్ నుండే ఇలా అందాల పోటీల్లో పాల్గొనడం మొదలెట్టింది. హర్యానా లో పుట్టిన ఆమె, హర్యానా రాష్ట్రానికి కూడా అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించింది, గెలుపొందింది కూడా. ఫెమీనా మిస్ ఇండియా (Femina Miss India) లో కూడా పాల్గొంది. ఫస్ట్ రన్నర్ అప్ గా నిలబడింది.

meenakshichaudhary8.jpg

సినిమాలు చెయ్యక ముందు మీనాక్షి ఒక వెబ్ సిరీస్ లో నటించింది. బీబీసీ వాళ్ళు ఇంగ్లీష్ వెబ్ సిరీస్ 'డాక్టర్ ఫోస్టర్' (Doctor Foster) కి హిందీ అనుకరణ 'అవుట్ అఫ్ లవ్' (Out of Love) అనే సీరీస్ లో మీనాక్షి నటించింది. ఆ తరువాత సుశాంత్ నటించిన 'ఇక్కడ వాహనములు నిలపరాదు' (Ikkada Vahanamulu Niluparaadu) అనే తెలుగు సినిమాతో ఆరంగేట్రం చేసింది. ఆసక్తికరం ఏంటంటే సుశాంత్ (Sushanth Akkineni), మీనాక్షి ఇద్దరూ ఒక వర్క్ షాప్ లో కలుసుకున్నారు, కానీ ఆమెకి సుశాంత్ నటుడు అని తెలీదు, అలాగే సుశాంత్ కి ఆమె అందాల పోటీలో గెలుపొందింది అని తెలీదు. కానీ తరువాత ఇద్దరూ ఒకే సినిమాలో నటించారు.

meenakshichaudhary2.jpg

మీనాక్షి డెంటల్ డాక్టర్ కూడాను. ఆమె అందాల పోటీలు, సినిమాలు చేస్తూనే డెంటల్ లో తన ఎం.బి.బి.ఎస్ ని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, డేరా బస్సి, పంజాబ్ (National Dental College and Hospital, Dera Bassi, Punjab) లో పూర్తి చేసింది. ఈ డెంటల్ డాక్టర్ ఇప్పుడు సినిమాల మీద పూర్తి ఫోకస్ పెట్టింది. ఎక్కువగా దక్షిణాది సినిమాలే చేస్తోంది. ఇప్పుడు ఈ విశ్వక్సేన్ సినిమా ఒప్పుకుంది, అలాగే ఒక తమిళ సినిమా కూడా చేస్తోంది. 'హిట్ 2' లో ముద్దు సీన్ లలో కూడా చేసింది.

Updated Date - 2023-03-20T11:39:34+05:30 IST