Golden Globe Awards: ‘థ్యాంక్యూ శ్రీవల్లి’.. వేదికపై ఎమోషనలైన కీరవాణి

ABN , First Publish Date - 2023-01-12T13:00:25+05:30 IST

ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాని వరించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది.

Golden Globe Awards: ‘థ్యాంక్యూ శ్రీవల్లి’.. వేదికపై ఎమోషనలైన కీరవాణి
Keeravaani

ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాని వరించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది. ఈ అవార్డుని సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి (M.M.Keeravani) అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.

వేదికపై కీరవాణి మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉద్వేగాన్ని ఇక్కడే ఉన్న నా భార్య శ్రీవల్లి (Srivalli)తో షేర్‌ చేసుకోవడం సంతోషంగా ఉంది. మామూలుగా అవార్డులు అందుకున్నప్పుడు చాలామంది ఇది నాది కాదు.. మరొకరికి చెందుతుందని మాట్లాడుతుంటారు. నేను అలా మాట్లాడకూడదని ప్లాన్ చేసుకున్నాను. కానీ సారీ.. నేనూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నా. ఎందుకంటే ఇవి నా మనసులోంచి వచ్చే మాటలు.

srivalli.jpg

వరుస క్రమంలో చెప్పాలంటే ముందుగా ఈ అవార్డు నా సోదరుడు, ఈ సినిమా దర్శకుడు రాజమౌళికి దక్కుతుంది. అతని విజన్‌కి, నా మీద నమ్మకంతో నన్ను సపోర్ట్‌ చేస్తున్నందుకు తనకు ధన్యవాదాలు. అలాగే ప్రేమ్‌ రక్షిత్‌, కాలభైరవ, రచయిత చంద్రబోస్, కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్, ఎన్‌.టి. రామారావు, రామ్‌చరణ్‌, సాహు సిద్ధార్థ్, జీవన్‌బాబుకు ధన్యవాదాలు. అలాగే చివరిగా ఒకటి చెప్పాలి. థ్యాంక్యూ శ్రీవల్లి... థ్యాంక్యూ వల్లీ’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. దీంతో కంగ్రాట్స్ చెబుతూ ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-01-12T13:00:27+05:30 IST